LIC Amritbaal: పిల్లల కోసం ఎల్ఐసీ అద్భుత ప్లాన్.. ఐదేళ్లు కడితే చాలు అదిరిపోయే బెనిఫిట్స్..

|

Feb 18, 2024 | 7:53 AM

మరో కొత్త పథకంతో ఎల్ఐసీ ప్రజల ముందుకొచ్చింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారి కోసం దీనిని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ పేరు అమృత్ బాల్(ప్లాన్ నంబర్ 874). ఇది నాన్ లింకెడ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 17 నుంచి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

LIC Amritbaal: పిల్లల కోసం ఎల్ఐసీ అద్భుత ప్లాన్.. ఐదేళ్లు కడితే చాలు అదిరిపోయే బెనిఫిట్స్..
Lic Amritbaal Policy
Follow us on

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటే ప్రజలకు గొప్ప భరోసా ఉంటుంది. అందుకే దీనిలో ఉండే పథకాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఎల్ఐసీ కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంటుంది. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని రకాల వినియోగదారులకు పథకాలుంటాయి. ఇప్పుడు మరో కొత్త పథకంతో ఎల్ఐసీ ప్రజల ముందుకొచ్చింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారి కోసం దీనిని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ పేరు అమృత్ బాల్(ప్లాన్ నంబర్ 874). ఇది నాన్ లింకెడ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 17 నుంచి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఎల్ఐసీ అమృత్ బాల్ ఫీచర్లు ఇవి..

ఈ ఒక్క ప్లాన్ పొదుపులకు, జీవిత బీమా, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ స్కీమ్ రూపకల్పన అలా చేశారు. ఇందులో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అతి తక్కువ పాలసీ చెల్లింపు కాల వ్యవధిని కలిగి ఉంటుంది. లేదా ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించే వీలు కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే ఈ ప్లాన్లో గ్యారంటీడ్ ఎడిషన్. అంటే మీరు ఈ ప్లాన్లో జమ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి రూ. 80 చొప్పున ప్రాథమిక మొత్తానికి యాడ్ వస్తుంది. అంతేకాక ప్రీమియం కాల వ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పాలసీ టర్మ్ కనీసం 10ఏళ్లు ఉంటుంది.

అర్హతలు ఇవి..

ఇవి పిల్లల పేరు మీద దీనిని తీసుకొవచ్చు. మీ చిన్నారి వయసు 30 రోజులు అంటే ఒక నెల నుంచి తీసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 13ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ కనిష్ట వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు 25ఏళ్లు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పెట్టుబడి ఎంతంటే..

ఎల్ఐసీ అమృత్ బాల్ స్కీమ్లో కనీస మొత్తం రూ. 2లక్షల నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం చెల్లింపు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. కనీసం ఐదేళ్ల నుంచి ఆరు, ఏడు ఏళ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు..

పాలసీ చెల్లించే సమయంలో పాలసీహోల్డర్ కి ఏదైనా అనుకోని సంఘటన వల్ల మరణం సంభవిస్తే డెత్ బెనిఫిట్స్ కూడా నామినీకి లభిస్తాయి. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ తో పాటు, గ్యారంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకూ జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పాలసీ కింద రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ప్లాన్ ను ఆన్ లైన్, ఆఫ్ లన్ లో కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నెల, మూడు నెలలు, అర్థ సంవత్సరానికి, ఏడాదికొసారి ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

ఈ ఉదాహరణ చూడండి..

ప్రస్తుతం మీ చిన్నారి వయసు ఐదేళ్లు అనుకోండి. ఆ చిన్నారి పేరు మీద రూ. 5లక్షల సమ్ అష్యూర్డ్ తో పాలసీ తీసుకున్నారనుకుందాం. మీ పాలసీ టర్మ్ 20 ఏళ్లు.. ప్రీమియం చెల్లింపు టర్మ్ ఏడేళ్లు ఎంచుకుంటే.. అప్పుడు మీరు ఏటా చెల్లించే మొత్తం రూ. 73,625 అవుతుంది. దీనికి జీఎస్టీ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏడేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఇది పాలసీ టర్మ్ 20 ఏళ్లు ముగిసే సమయానికి అంటే మీ చిన్నారి వయసు అప్పటికి 25ఏళ్లు.. అప్పుడు మీరు చెల్లించే మొత్తం రూ. 5.15లక్షలు అవుతుంది. దీనికి గ్యారంటీడ్ ఎడిషన్స్ కింద ఏడాదికి ప్రతి వెయ్యికి 80చొప్పున మొత్తం రూ. 8లక్షలు సమకూరుతుంది. మీరు చెల్లించిన మొత్తానికి ఈ ఎడిషన్స్ యాడ్ అవడం వల్ల మీకు మొత్తం రూ. 13లక్షలు మెచ్యూరిటీ సమయానికి అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..