LIC HFL Offers: మీరు హోమ్ లోన్ తీసుకున్నారా..? ప్లాట్ కానీ ఫ్లాట్ కాని కొనే ఆలోచనల్లో ఉన్నారా..? అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- LIC అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-(LICHFL) అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన ప్రత్యేక గృహ రుణ ఉత్పత్తి గ్రిహా వరిష్ట కింద ఆరు ఇఎంఐ మాఫీని (వేవర్) ప్రకటించింది.
అంటే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటే బిల్డర్ ఆ ఇంటిని మీకు అప్పగించిన తర్వాత లేదా మీకు లోన్ ఇచ్చిన 48 నెలల తర్వాత అసలు కట్టాల్సి ఉంటుంది. అంటే మీకు లోన్ మంజూరు కాగానే ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ స్కీమ్ ప్రకటించింది.
ఇదొక్కటే కాదు… 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్. ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలల్లో 6 ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఆరు EMI మినహాయింపు 37, 38, 73, 74, 121 వ 122 వ EMI లకు వ్యతిరేకంగా ఇవ్వబడుతుంది.
పన్షనర్ల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రత్యేక పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. గృహ వరిష్ట పథకంతో గృహ రుణాన్ని 80 ఏళ్ల వయస్సు వరకు కాల వ్యవధిపై లేదా 30 ఏళ్లు ఏది తక్కువగా ఉంటే ఆ కాలానికి రుణాన్ని అందిస్తుంది. ఉద్యోగ పదవి విరమణ పొందిన వారు/ భవిష్యత్ లో ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.
కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి రుణ వడ్డీ రేటును తగ్గించింది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్న వారికి 6.90 శాతం రుణ రేటు వర్తిస్తుంది. రుణాన్ని పొందాలని అనుకునే వారికి రూ.50 లక్షల వరకు కంపెనీ గృహ రుణం ప్రస్తుతం అందిస్తోంది.