Britannia: ఉక్రెయిన్-రష్యా యుద్ధం(Russia Ukraine War) తెచ్చిన ఇబ్బందులతో పాటు ఇండోనేషియా తమ దేశం నుంచి పామాయిల్(Palm Oil) ఎగుమతులను నిలిపివేయటంతో ఆ ప్రభావం ఇప్పుడు స్నాక్స్ తయారీ కంపెనీలపై కూడా పడింది. ఈ కారణాల వల్ల ముడిపదార్ధాల ధరలు విపరీతంగా పెరిగటంతో సదరు కంపెనీలు సైతం రేట్లు పెంపు బాట పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని దిగ్గజ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా కూడా తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. బ్రిటానియా ఉత్పత్తుల ధరలు 10 శాతం వరకు పెరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే బ్రిటానియా ధరలను 10 శాతం వరకు పెంచింది. ద్రవ్యోల్బణం ఊహించని స్థాయిలో పెరుగటంపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం మూలంగా కీలక ముడిపదార్ధాల రేట్లు పెరగటంతో పెంపు తప్పటం లేదని కంపెనీ వెల్లడించింది.
బిస్కెట్ల తయారీలో కీలకమైన గోధుమలు, వెజిటబుల్ ఆయిల్, చక్కెర ధరలు ఇటీవల భారీగా పెరిగాయని బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రి అన్నారు. వీటికి తోడు పెరుగుతున్న గ్యాస్ ధరలు, కరెంటు రేట్లు, లేబర్ ఛార్జీలు, రవాణా ఖర్చులు, ఇతర బేకింగ్ ముడిపదార్ధాల ధరల కారణంగా తన ప్రొడక్టుల ధరలను మరింత పెంచనున్నట్టు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఇప్పటికే గోధుమల ధరలు పెరిగాయని బెర్రి తెలిపారు. ప్రస్తుతం పామాయిల్ ఎగుమతులను ఇండోనేషియా నిషేధించడంతో.. వంటనూనెలు కూడా ఖరీదైనవిగా మారాయని వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఉత్పత్తుల ధరలను 10 శాతం పెంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం చాలా కష్టకాలం కొనసాగుతోందని కంపెనీ అభిప్రాయపడింది. ప్రతి నెలా తాము పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కన్జూమర్లపై ఎక్కువ భారాన్ని తాము మోపాలనుకోవడం లేదని.. కానీ మేజర్ కమోడిటీల రేట్లు పెరుగుదల కొనసాగితే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గోధుమల ధరలు పెరుగుదల ప్రభావం భారత్‌పైనా పడుతోంది. భారత్‌లో పండే గోధుమలకు యుద్ధం కారణంగా డిమాండ్ పెరగడం, వివిధ కారణాల వల్ల దేశంలో గోధుమల ఉత్పత్తి తగ్గడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stock Market: లాభాల ఆవిరితో ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. లాభాల్లో పవర్, ఐటి కంపెనీల షేర్లు..
Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..