Stock Market: లాభాల ఆవిరితో ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. లాభాల్లో పవర్, ఐటి కంపెనీల షేర్లు..

Stock Market: బుధవారం ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో నష్టాల్లోకి కూరకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ఆరంభంలో కోలుకున్నట్లు కనిపించాయి. కానీ చివరికి అవి ఫ్లాట్ గా ముగిశాయి.

Stock Market: లాభాల ఆవిరితో ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. లాభాల్లో పవర్, ఐటి కంపెనీల షేర్లు..
Stock Market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 05, 2022 | 4:40 PM

Stock Market: బుధవారం ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో నష్టాల్లోకి కూరకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ఆరంభంలో కోలుకున్నట్లు కనిపించాయి. కానీ చివరికి అవి ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన కొనుగోళ్లతో కొంత ఊపందుకున్న దేశీయ మార్కెట్లు మధ్యాహ్నం తరువాత మాత్రం డీలాపడ్డాయి. వరుసగా పెరిగిన అమ్మకాల ఒత్తిడితో లాభాలు ఆవిరయ్యాయి. నెలలో నాలుగవ ట్రేడింగ్ సెషన్ లో సెన్సెక్స్ 33.20 పాయింట్ల లాభంతో, నిఫ్టీ కేవలం 5 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఇంట్రాడే డేలో గరిష్ఠాలతో పోలిస్తే 800 పాయింట్లు సూచీ కోల్పోయింది. ఉదయం.. సెన్సెక్స్ 586 పాయింట్లు లేదా 1.05% లాభంతో 56,255 వద్ద ప్రారంభం కాగా.. మరో బెండ్ మార్క్ సూచీ నిఫ్టీ 177 పాయింట్లు జంప్ చేసి 16,854 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 14 లాభపడగా, 16 నష్టపోయాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 30 పాయింట్ల లాభంలో ముగిసింది.

BSE మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ 50 పాయింట్లకు పైగా క్షీణించాయి. మిడ్ క్యాప్‌లో ఏబీబీ, రుచి సోయా, అదానీ పవర్, ఇండ్యూరెన్స్, గుజరాత్ గ్యాస్, అశోక్ లేలాండ్, బీహెచ్ఈఎల్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, బయోకాన్, బ్యాంక్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండియా, నౌక్రి, ఇండియా హోటల్, టాటా కన్స్యూమర్ కంపెనీల షేర్లు క్షీణించాయి. స్మాల్ క్యాప్స్‌లో హైకల్, టైమ్‌టెక్నో, టార్క్, కామధేను, మాంటీ కార్లో ముందంజలో ఉన్నాయి. వీటికి తోడు ఆటో, ఆర్థిక సేవలు, ఐటీ, మెటల్ రంగాల షేర్లు లాభపడ్డాయి. బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు క్షీణించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Wheat: దేశంలో భారీగా పెరుగుతున్న గోధుమల ధరలు.. కారణం అదే..

Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..