Post Office Interest Rates: చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు.. పోస్టాఫీస్‌ పథకాల్లో షాకింగ్‌ వడ్డీ రేట్లు ఇవే..!

చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. అందుకు అనుగుణంగా తదుపరి త్రైమాసికానికి నిర్ణయిస్తారు. జూన్ 30, 2023న జరిగిన చివరి సమీక్షలో ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక సంవత్సరం & రెండు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచారు.

Post Office Interest Rates: చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు.. పోస్టాఫీస్‌ పథకాల్లో షాకింగ్‌ వడ్డీ రేట్లు ఇవే..!
Post Office Monthly Income
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:09 PM

స్థిర ఆదాయ సాధనాల కోసం చూస్తున్న వారికి చిన్న పొదుపు పథకాలు మంచి ఎంపికగా ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పొదుపు ధ్రువపత్రాలు, పోస్టాఫీసు డిపాజిట్లతో సహా ఈ పథకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.  చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. అందుకు అనుగుణంగా తదుపరి త్రైమాసికానికి నిర్ణయిస్తారు. జూన్ 30, 2023న జరిగిన చివరి సమీక్షలో ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక సంవత్సరం & రెండు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచారు. ఈ పెరిగిన తాజా వడ్డీ రేట్లు ఎంత శాతం ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

చిన్న పొదుపు పథకాలు అంటే?

పౌరులు క్రమం తప్పకుండా పొదుపు చేయడాన్ని ప్రోత్సహించడానికి ఇవి ప్రభుత్వం ద్వారా నిర్వహించే పొదుపు సాధనాలు. చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలను కలిగి ఉంటాయి . పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు మరియు నెలవారీ ఆదాయ ప్రణాళికలు. పొదుపు డిపాజిట్లలో 1-3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర వంటి పొదుపు ధృవపత్రాలు కూడా ఉన్నాయి. సామాజిక భద్రతా పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ ఆదాయ ఖాతా ఉంటుంది.

చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్లు

  • సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
  • 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం
  • 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం
  • 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7 శాతం
  • 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం
  • 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.7 శాతం (ముందు 6.5 శాతం)
  • నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC): 7.7 శాతం
  • కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం
  • సుకన్య సమృద్ధి ఖాతా: 8.0 శాతం
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
  • నెలవారీ ఆదాయ ఖాతా: 7.4 శాతం.

అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌లతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చలేదు. అయితే 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై మాత్రమే వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగి 6.7 శాతానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!