ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ కూడా కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. 2025 జనవరి ఒకటి తర్వాత తన వాహనాలను కొనుగోలు చేసిన వారికి మూడేళ్లు, లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. రెనాల్ట్ కంపెనీకి మన దేశంలో మంచి మార్కెట్ ఉంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ప్రస్తుతం దేశంలో ఈ కంపెనీకి చెందిన కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ మోడల్ త్వరలో విడుదల కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లపై రెనాల్ట్ ఆఫర్లు అమలు చేస్తుంది. వీటికి మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందజేస్తుంది. దీనికి అదనంగా కొత్త వారంటీ ప్యాకేజీలను తీసుకువచ్చింది. నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్లు, ఐదేళ్లు లేదా 1,20,000 కిలోమీటర్లు, ఆరేళ్లు లేదా 1,40,000 కిలోమీటర్లు, ఏడేళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వరకూ ఇవి వర్తిస్తాయి.
రెనాల్ట్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ కస్టమర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో వాహనంలోని మెకానికల్, మెటీరియల్, తయారీ లోపాలు, ఎలక్ట్రికల్ వైఫల్యాలకు సంబంధించి అన్ని సమస్యలను అదనపు ఖర్చులు లేకుండా పరిష్కరిస్తారు. అలాగే రోడ్డుసైడ్ అసిస్టెన్స్, యాక్సిడెంటల్ టోయింగ్ కవరేజీ తదితర సౌకర్యాలు కల్పిస్తుంది. తర్వాత కస్టమర్లు తమ వారంటీని పైన చెప్పిన విధంగా 4, 5, 6, 7 ఏళ్ల వరకూ పొడిగించుకోవచ్చు. రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ సీఈవో ఎం.వెంకటరామ్ మాట్లాడుతూ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా మూడేళ్లు, లక్ష కిలోమీటర్ల వారంటీ తీసుకువచ్చినట్టు తెలిపారు. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కార్లపై విశ్వాసం ఏర్పడుతుందన్నారు.
ప్రస్తుతం నగరాల్లో స్థిరపడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాటి శివారు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు వెలిశాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు కారు తప్పనిసరి అవసరంగా మారుతోంది. కుటుంబంలో సుమారు నలుగురు సభ్యులంటే కారు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే సురక్షితంగా, వేగంగా, సౌకర్యంగా ప్రయాణం చేయడానికి కార్లు చాలా ఉపయోగపడతాయి. నేటి బీజీ జీవితంలో కార్ లేకపోతే వేగంగా పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి