Post Office: కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) రెండూ భారత ప్రభుత్వ పథకాలు. వీటిని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య ఏది ఉత్తమం అనే విషయంలో అందరు గందరగోళానికి గురవుతారు. కిసాన్ వికాస్ పత్ర రిటర్న్స్ ఇస్తుంది. కానీ మీరు దీనిపై పన్ను ఆదా చేయలేరు. అందువల్ల పన్ను ఆదా చేయాల్సిన డిపాజిటర్లకు KVP కంటే NSC ఉత్తమం. కానీ రిటర్న్స్ పరంగా KVP వడ్డీ విషయంలో NSC కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
NSC పథకంలో డిపాజిటర్ సంవత్సరానికి 6.8 శాతం హామితో ఉన్న వడ్డీని పొందుతాడు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సి పథకంలో 6.8 శాతం వడ్డీని ఇస్తున్నారు. వడ్డీ రేటు మారితే రాబడి కూడా మారుతుంది. NSC 5 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. ఈ సమయంలో డబ్బులను ఉపసంహరించుకోలేరు. మెచ్యూరిటీ తరువాత వడ్డీని మొత్తంతో పాటుగా చెల్లిస్తారు. మీరు కేవలం రూ.100తో ఈ పథకంలో పొదుపు చేయడం ప్రారంభించవచ్చు.
KVP కూడా ప్రభుత్వ-ఆధారిత డిపాజిట్ పథకం. KVP లో కూడా హామి ఇచ్చే రాబడి ఉంటుంది. లేఖ జారీ చేసే సమయంలో నిర్ణయించిన వడ్డీ రేటు చెల్లిస్తారు. కస్టమర్ కోరుకుంటే 30 నెలల తర్వాత ఆ లేఖను వడ్డీతో రీడీమ్ చేయవచ్చు. ప్రస్తుతం KVP పై వడ్డీ రేటు 6.9 శాతం. ఒక మైనర్ కూడా KVP ని తీసుకోవచ్చు. ఎన్‌ఎస్‌సి మాదిరి దీనిని నిబంధనల ప్రకారం మరొకరికి బదిలీ చేయవచ్చు. NSCకి KVPకి తేడా ఏంటంటే KVP పై మెచ్యూరిటీపై పన్ను పొందలేరు. కెవిపిలో కనీస డిపాజిట్ మొత్తం రూ .1000.