Business Ideas: సూపర్‌ బిజినెస్‌ ఐడియా.. రోజుకు రూ.5 వేల ఆదాయం! పెట్టుబడి కూడా చాలా తక్కువ..

ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న కునాఫా వ్యాపారం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తుంది. చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాల కన్నా సొంతంగా కునాఫా స్టాల్ ప్రారంభించడం లాభదాయకం. కేవలం రూ.30,000 పెట్టుబడితో రోజుకు రూ.2000-రూ.5000 వరకు సంపాదించవచ్చు. సరైన అవగాహన, కష్టపడే తత్వం ఉంటే చాలు, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా విజయం సాధించవచ్చు.

Business Ideas: సూపర్‌ బిజినెస్‌ ఐడియా.. రోజుకు రూ.5 వేల ఆదాయం! పెట్టుబడి కూడా చాలా తక్కువ..
Indian Currency 6

Updated on: Oct 19, 2025 | 4:22 PM

చిన్న చిన్న ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసే బదులు.. ఒక చిన్న వ్యాపారం అయినా పర్లేదు చేసుకుందాం అని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, సరైన అవగాహన లేకనో లేదా వ్యాపారం అంటే పెట్టుబడి చాలా‌ ఉండాలి, అనుభవం ఉండాలనే అపోహతోనే వెనుకడుగు వేస్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే బిజినెస్‌ ఐడియాకు అవన్నీ అవసరం లేదు. కాస్త కష్టపడే తత్వం, సక్సెస్‌ అవ్వాలనే బలమైన కోరిక ఉంటే చాలు.. ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్‌ అవ్వొచ్చు. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటో చూద్దాం..

ప్రస్తుతం కునాఫా అనే స్వీట్ పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్న స్వీట్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో యువతి యువకులు ఎక్కువగా కునాఫా స్వీట్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో కునాఫా వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీటిని పెళ్లిళ్లలో సైతం వడ్డిస్తున్నారు. నిజానికి అరబ్ దేశాలకు చెందిన కునాఫా స్వీట్ తినేందుకు రుచికరంగా, చూసేందుకు కనులవిందుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దీన్ని ఒక బిజినెస్ కింద మార్చుకొని కునాఫా స్టాల్ పెట్టి విక్రయించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

కునాఫా లైవ్ లో తయారు చేస్తుండగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. కనుక మీరు స్వీట్ ఫుడ్ స్టైల్ లో స్టాల్ పెట్టుకొని విక్రయించినట్లయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పవచ్చు. దీనికి తోడు మీరు మీ కునాఫా స్టాల్ ను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసేందుకు కునాఫా చేసే సమయంలో వీడియోలను తీసి ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్లయితే, చక్కటి సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సోషల్‌ మీడియా నుంచి కూడా మీరు ఇన్‌కమ్‌ జనరేట్‌ చేసుకోవచ్చు.

మరి కునాఫా స్వీట్‌ తయారీ బిజినెస్‌ కోసం ఏం కావాలో ఇప్పుడు చూద్దాం.. ఒక ఓవెన్, ప్యాకింగ్ మెటీరియల్, కునాఫా తయారు చేసేందుకు అవసరమైన పెట్టుబడి దాదాపు 30 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చిన్న పెట్టుబడితో ప్రారంభించినట్లయితే నెమ్మదిగా సేల్స్ పెరిగి, మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒక కునాఫా తయారు చేసేందుకు రూ.50 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు కనీసం వంద రూపాయల నుంచి రూ.150 వరకు విక్రయించవచ్చు. ఈ లెక్కన మీరు రోజుకు 20 కునాఫాలు అమ్మినట్లయితే ఒక పీస్ మీద రూ.50 నుంచి రూ.100 లాభం వస్తుంది. ఈ లెక్కన ప్రతి రోజు రూ.2000 లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రోజుకు ఎక్కువ కునాఫాలను విక్రయించినట్లయితే మీ లాభం రూ.5000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి