AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTM Bike: రూ. 2 లక్షల స్పోర్ట్స్ బైక్‌ను.. కేవలం రూ. 45 వేలకే ఇంటికి తెచ్చుకోండిలా..

భారతీయ బైక్ మార్కెట్‌లో కేటీఎమ్(KTM) మోటర్ సైకిళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ స్పోర్ట్స్‌ బైక్‌లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

KTM Bike: రూ. 2 లక్షల స్పోర్ట్స్ బైక్‌ను.. కేవలం రూ. 45 వేలకే ఇంటికి తెచ్చుకోండిలా..
Ktm Bike
Ravi Kiran
|

Updated on: Feb 03, 2023 | 9:54 AM

Share

భారతీయ బైక్ మార్కెట్‌లో కేటీఎమ్(KTM) మోటర్ సైకిళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ స్పోర్ట్స్‌ బైక్‌లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ బైక్ మోడల్స్‌లో ఎక్కువగా అమ్ముడైనవి కేటీఎమ్ ఆర్‌సీ 200. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.14 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. అయితే, మీరు ఈ అద్భుతమైన బైక్‌ను కేవలం రూ.45 వేలకు కొనుగోలు చేయవచ్చు. అదేంటి అంత తక్కువని ఆలోచిస్తున్నారా.? సెకెండ్ హ్యాండ్ బైక్‌ల గురించి మీరు వినే ఉంటారు. వాటిని విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ సైట్లు ఈ KTM RC 200 మోడల్‌పై పలు డీల్స్ అందుబాటులో ఉంచాయి. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

  • డ్రూమ్(Droom) ఆఫర్: KTM RC 200, 2021 మోడల్ డ్రూమ్‌లో రూ. లక్షా 77 వేలకు అందుబాటులో ఉంది. ఇది బీఎస్6 ఇంజిన్ కలిగి ఉన్న బైక్ కాగా.. ఇప్పటివరకు ఈ వాహనం 5 వేల కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో లభిస్తుంది.
  • ఓఎల్‌ఎక్స్(OLX) ఆఫర్: కేటీఎమ్ ఆర్‌సీ 200, 2015 మోడల్‌పై OLXలో మరో ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది కేవలం రూ. 80 వేలకే దొరుకుతుంది. అలాగే ఈ బైక్ మొత్తం 33,500 కిలోమీటర్లు తిరిగింది. దీన్ని ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో పొందొచ్చు.
  • క్వికర్(Quikr) ఆఫర్: ఈ మోడల్ బైక్ క్వికర్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇక్కడ KTM, RC 200, 2019 మోడల్‌ను కేవలం రూ.45,000కే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ బైక్ ఇప్పటివరకు 9,632 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. అలాగే ఈ వాహనం అహ్మదాబాద్ సర్కిల్‌లో దొరుకుతోంది.

Bike Ad