కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ సోమవారం కోటక్ నేషన్ బిల్డర్స్ శాలరీ ఖాతాను ప్రారంభించింది. ఇది ప్రభుత్వ రంగ యూనిట్లతో పాటు కార్పొరేట్ వారికి కూడా ఉపయోగపడనుంది. కోటక్ నేషన్ బిల్డర్స్ శాలరీ అకౌంట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పని చేస్తున్న వారు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. దీనిలో ప్రజలు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సేవలను పొందుతారు. ఈ ఖాతా జీవితకాల జీరో బ్యాలెన్స్ సౌకర్యం, ప్రిఫరెన్షియల్ సర్వీస్ ఛార్జీలు, ఉచిత లాకర్, నెలలో రూ. 2 లక్షల వరకు ఉచిత నగదు డిపాజిట్, నెలకు 30 ఉచిత లావాదేవీలతో వస్తుంది. ఉద్యోగులకు ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఉచిత యాడ్-ఆన్ డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఖాతాలో రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద కవరేజీ కూడా అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు రోడ్డు రైలు ప్రమాదం కారణంగా పాక్షికంగా లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే రూ.30 లక్షల కవరేజీ కూడా అందుబాటులో ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్-ప్రెసిడెంట్ రిటైల్ లయబిలిటీస్ అండ్ బ్రాంచ్ బ్యాంకింగ్ విరాట్ దేవాన్‌జీ మాట్లాడుతూ దేశాన్ని నిర్మించే దేశ నిర్మాతలను ప్రోత్సహించడానికి, అభినందించడానికి కోటక్ నేషన్‌బిల్డర్స్ శాలరీ అకౌంట్‌ను రూపొందించామని అన్నారు. మారుతున్న ఆర్థిక వాతావరణంలో సహాయం చేయడానికి ఈ ఖాతా సృషించారు. మేము అతని బ్యాంకర్‌గా మారడం గౌరవంగా భావిస్తున్నామని, మా ఉత్పత్తులు, సేవల ద్వారా అతనికి తన సన్నిహితులకు సాధికారత కల్పిస్తామని ఆయన అన్నారు. RuPay ప్లాటినం డెబిట్ కార్డ్ ఎంపిక చేసిన భారతీయ బ్రాండ్‌లపై 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. దీనితో పాటు, కార్డు కింద సంవత్సరానికి విమానాశ్రయాలలో నాలుగు దేశీయ, రెండు అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది.