Indian Railway: రైల్వేలో ఉద్యోగం సంపాదించడం మీ లక్ష్యమా..! అయితే కచ్చితంగా ఈ న్యూస్‌ తెలుసుకోండి..

|

Oct 31, 2021 | 8:00 PM

Indian Railway: ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగుల మొదటి ఎంపిక రైల్వే డిపార్ట్‌మెంట్. ఎందుకంటే ఇందులో మంచి జీతంతో పాటు, ఉద్యోగులకు అనేక సౌకర్యాలు,

Indian Railway: రైల్వేలో ఉద్యోగం సంపాదించడం మీ లక్ష్యమా..! అయితే కచ్చితంగా ఈ న్యూస్‌ తెలుసుకోండి..
Railway
Follow us on

Indian Railway: ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగుల మొదటి ఎంపిక రైల్వే డిపార్ట్‌మెంట్. ఎందుకంటే ఇందులో మంచి జీతంతో పాటు, ఉద్యోగులకు అనేక సౌకర్యాలు, అలవెన్సులు లభిస్తాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరూ రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అంతేకాదు వారికి రైలులో ఉచిత ప్రయాణం కూడా లభిస్తుంది. అందుకే ఇటీవల జరిగిన రైల్వే ఎన్‌టీపీసీ పరీక్షకు కోట్లాది మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అయితే ఇప్పుడు రైల్వే పరీక్షలకు సంబంధించి కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా చాలా రకాలుగా మోసాలకు గురవుతున్నారు. అందుకే భారతీయ రైల్వే ఈ మోసాల గురించి ట్వీట్ చేసింది. రైల్వేలో ఉద్యోగాలు పొందడానికి సిద్ధమవుతున్న యువతను హెచ్చరించింది. మోసాలు ఎలా జరుగుతున్నాయో వివరించే ప్రయత్నం చేసింది.

మోసం ఎలా జరుగుతుంది?
రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఇప్పటికే వందలాది మంది మోసానికి గురయ్యారు. పరీక్షలో గ్యారెంటీగా పాస్‌ చేయిస్తామని కొందరు, కొన్నిసార్లు లంచం ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో మరికొందరు యువతను టార్గెట్‌ చేసి వారి నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు నకిలీ ప్రకటనల ద్వారా మొదలవుతాయి. ముందుగా రైల్వేలో ఉద్యోగం పేరుతో నకిలీ ప్రకటనలు జారీ చేస్తారు. టెంప్టింగ్ ఆఫర్‌లు ఇస్తూ నిరుద్యోగులను ట్రాప్ చేసి వారి నుంచి అందినకాడికి దోచుకుంటారు.

రైల్వే ఏం చెప్పింది?
ఈ మోసాలన్నింటినీ నివారించాలని రైల్వే హెచ్చరించింది. ‘గుర్తుంచుకోండి కేవలం విద్యార్హత ద్వారా మాత్రమే మీకు రైల్వేలో ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా అన్యాయమైన మార్గాల ద్వారా రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకోవడం వీలుకాదు. కొంతమంది అక్రమార్కులు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల కోసం ఫేక్ ఆఫర్లు ఇవ్వొచ్చు. ఏదైనా ప్రకటనను విశ్వసించే ముందు దాని వాస్తవికతను తప్పనిసరిగా తనిఖీ చేయాలని’ రైల్వే సూచించింది.

నకిలీ ప్రకటనలను ఎలా గుర్తించాలి?
నకిలీ ప్రకటనలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే తన ట్వీట్‌లో పేర్కొంది. యూత్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ప్రముఖ దినపత్రికలు, ఉపాధి వార్తాపత్రికలలో ప్రకటనలను చూడండి. రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ల సహాయంతో Facebook, WhatsApp, ఇతర సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రకటనలను తనిఖీ చేయండి. రైల్వేలకు సంబంధించిన సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించండి.

PMFBY: ప్రధానమంత్రి బీమా యోజన తాజా అప్‌డేట్.. ఈ 3 రాష్ట్రాల రైతులు గరిష్ట ప్రయోజనం పొందారు.. ఎలాగంటే..?

Shruti Haasan: ఇటీవల బాగా బ్లాక్ రిఫర్ చేస్తున్న కమల్ తనయ.. పలు కామెంట్స్ సొంతం చేసుకుంటున్న ‘శృతి హాసన్’ ఫొటోస్..

T20 World Cup 2021: 131 పరుగులు.. 11 వికెట్లు.. ఆల్ రౌండ్ ఆటతో ఆకట్టుకున్న ఆటగాడు.. గాయంతో టోర్నీ నుంచి ఔట్