Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

|

Mar 25, 2021 | 6:46 PM

Provident Fund (PF): మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే మీకు పీఎఫ్‌ అకౌంట్‌ ఉంటుంది. మీ వేతనం నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. కంపెనీ కూడా దీనికి..

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు
Provident Fund
Follow us on

Provident Fund (PF): మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే మీకు పీఎఫ్‌ అకౌంట్‌ ఉంటుంది. మీ వేతనం నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. కంపెనీ కూడా దీనికి సమానమైన మొత్తాన్ని మీ ఈపీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేస్తుంది. అయితే మీకు డబ్బులు అత్యవసరం అయినప్పుడు పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి విత్‌ డ్రా చేసుకోవచ్చు. అత్యవసరం ఉన్నా.. మీరు ఉద్యోగం మానేసి డబ్బునుల విత్‌ డ్రా చేసుకోవాలన్నా కొన్ని పనులు మీరు చేసి ఉండాలి. లేకపోతే డబ్బులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు డబ్బులు విత్‌డ్రా చేయలేరు.

కేవైసీ కారణంగా విత్‌డ్రాకు సమస్య

మీ పీఎఫ్‌ ఖాతాకు కేవైసీ తప్పనిసరి. మీ ఖాతాకు కేవైసీ లేకపోతే డబ్బులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు పీఎఫ్‌ ఖాతాకు కేవైసీ చేసి ఉండాలి. కేవైసీ పూర్తి చేయనందున మీరు డబ్బులు తీసుకునే సమయంలో సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందస్తుగా జాగ్రత్తలు పడితే మరి మంచిది.

ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్ ఇలా

మీరు ఆన్‌లైన్‌లోనే కేవైసీ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు. ముందుగా మీ ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లాలి. యూఏఎన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి. మేనేజ్‌ ట్యాబ్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూలో కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో బ్యాంకు అకౌంట్‌, పాన్‌ నెంబర్‌, ఆధార్ కార్డు నెంబర్‌ ఇలా పూర్తి వివరాలను నమోదు చేయాలి. తర్వాత సేవ్‌పై క్లిక్‌ చేయాలి. పెండింగ్‌ కేవైసీ సెక్షన్‌లో డేటా సేవ్‌ అవుతుంది. ఇక మీరు ఎంటర్‌ చేసిన వివరాలు సరైనవి అయితే వెరిఫైడ్‌ అని చూపిస్తుంది. అయితే బ్యాంకు అకౌంట్‌, పాన్‌ కార్డు, ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ఐడీ, రేషన్‌ కార్డు వంటి డాక్యుమెంట్లను కేవైసీ ప్రక్రియ కోసం ఉపయోగించుకోవచ్చు.

పీఎఫ్‌ ఖాతాకు UAN లింక్‌

మీ పీఎఫ్‌ ఖాతాను యూఏయన్‌ (UAN) లింక్‌ చేసి ఉండాలి. ఖాతా లింక్‌ చేయకపోయినా..డబ్బు పొందడంలో సమస్య ఏర్పడుతుంది. అందువల్ల ముందుగానే లింక్‌ చేయండి. యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా కొన్ని ఇతర పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ వివరాలను కూడా పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి: ICICI Bank EMI: కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఐసీఐసీఐ బ్యాంకు.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఈఎంఐ సదుపాయం

Personal Loan: కరోనా కాలంలో వేటి కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారో తెలుసా..?.. తాజా రిపోర్టు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?