Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ancestral Property: వారసత్వంగా వచ్చిన ఆస్తిపై పన్ను విధించబడుతుందా? అమ్మకంపై ఎంత ట్యాక్స్‌ చెల్లించాలి?

మనలో చాలా మందికి పూర్వీకుల ఆస్తి ఉండవచ్చు. కొందరు ఈ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆస్తి మీ తండ్రి పేరు నుంచి మీ పేరుకు బదిలీ అయినప్పుడు పన్ను ఉందా? ఈ వారసత్వ ఆస్తి అమ్మకంపై పన్ను చెల్లించాలా? ఏ పన్ను వర్తిస్తుందో తెలియక కొందరు తికమకపడవచ్చు. అన్నింటిలో మొదటిది వంశపారంపర్య ఆస్తి అంటే ఏమిటి? పన్ను ఎలా లెక్కించబడుతుందనే వివరాలు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పిత్రార్జిత ఆస్తి అంటే తండ్రి, తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన..

Ancestral Property: వారసత్వంగా వచ్చిన ఆస్తిపై పన్ను విధించబడుతుందా? అమ్మకంపై ఎంత ట్యాక్స్‌ చెల్లించాలి?
Ancestral Property
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2023 | 7:30 PM

మనలో చాలా మందికి పూర్వీకుల ఆస్తి ఉండవచ్చు. కొందరు ఈ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆస్తి మీ తండ్రి పేరు నుంచి మీ పేరుకు బదిలీ అయినప్పుడు పన్ను ఉందా? ఈ వారసత్వ ఆస్తి అమ్మకంపై పన్ను చెల్లించాలా? ఏ పన్ను వర్తిస్తుందో తెలియక కొందరు తికమకపడవచ్చు. అన్నింటిలో మొదటిది వంశపారంపర్య ఆస్తి అంటే ఏమిటి? పన్ను ఎలా లెక్కించబడుతుందనే వివరాలు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పిత్రార్జిత ఆస్తి అంటే తండ్రి, తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తి. తల్లి వైపు నుంచి సంక్రమించిన ఆస్తి వారసత్వ ఆస్తిగా పరిగణించబడదు.

భారతదేశంలో వారసత్వపు పన్ను వర్తించదు. మీరు విక్రయించాలని నిర్ణయించుకునే వరకు మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపై పన్ను విధించబడదు. వారసత్వ ఆస్తి ద్వారా మీరు సంపాదించిన ఆదాయం మూలధన లాభాల పరిధిలోకి వస్తుంది. అందుకే మీరు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయిస్తే పన్ను చెల్లించాలి.

వారసత్వంగా వచ్చిన ఆస్తి అమ్మకంపై ఎంత పన్ను?

వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించడంపై ఎంత పన్ను విధించబడుతుంది అనేది మీరు దానిని ఎంతకాలం కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు 24 నెలలకు పైగా ఆస్తిని కలిగి ఉంటే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20.8% పన్ను చెల్లించాలి. మీరు 24 నెలల కంటే తక్కువ కాలం పాటు ఆస్తిని కలిగి ఉంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. పన్ను రేటు మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. పన్ను, పెట్టుబడి నిపుణుడిగా బల్వంత్ జైన్ వివరిస్తూ.. వారసత్వంగా వచ్చిన ఆస్తి మీ ఆధీనంలో ఉన్న కాలం చాలా ముఖ్యం. ఆస్తిని అసలు యజమాని కొనుగోలు చేసిన తేదీ ఆధారంగా ఈ వ్యవధి నిర్ణయించబడుతుంది. ప్రస్తుత ఆస్తుల విలువను లెక్కించేందుకు ప్రభుత్వం వార్షిక సూచికను తయారు చేస్తుంది. 2001లో ఈ సూచిక 100. 2003లో అది 109కి చేరింది. 2020లో అది 317కి చేరింది.

ఇవి కూడా చదవండి

ధర సూచిక తెలుసుకోవడం ఎలా?

20 ఏళ్ల క్రితం మీరు రూ. 10 లక్షలతో ఆస్తిని కొనుగోలు చేశారు. దీన్ని ప్రస్తుత సూచికతో గుణించి, 2003 సూచికతో భాగిస్తే ప్రస్తుత ఆస్తి ధర రూ. 29.08 లక్షలుగా నిర్ణయించబడింది. ఇందుకోసం కొనుగోలు ధర ప్రస్తుత ధర రూ.29.08 లక్షల నుంచి రూ.10 లక్షలు తగ్గించుకోవాలి. అప్పుడు మూలధన లాభాలు 19.08 లక్షల రూపాయలు. ఈ మొత్తం రూ.3.96 లక్షలపై 20.8% పన్ను రేటు వర్తిస్తుంది. ఈ ఆస్తి 2001 తర్వాత కొనుగోలు చేస్తే 2001కి ముందు కొనుగోలు చేసిన ఆస్తులకు, మీరు ప్రభుత్వ-అధీకృత సర్వేయర్ సర్వీస్ ద్వారా వాల్యుయేషన్ పొందవచ్చు. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆస్తి వారసత్వంగా లేదా వీలునామా ద్వారా సంపాదించినట్లయితే ఎటువంటి పన్ను విధించబడదు. అయితే, విక్రయించినప్పుడు వచ్చిన డబ్బును ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయం మూలధన లాభాల కిందకు వస్తుంది. అందుకే పన్ను చెల్లించాలి.

వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించే ముందు చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయండి. పన్ను సలహాదారు నుంచి పన్ను లెక్కలను పొందండి. పన్ను ఆదా చేసే పెట్టుబడి అవకాశాల కోసం కూడా చూడండి. చివరగా మీరు ఆస్తిని విక్రయించడం ద్వారా పన్ను భారాన్ని ఎదుర్కొంటున్నట్లయితే దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెట్రో స్టేషన్లలో ఈ ఎల్లో టైల్స్ ఎందుకుంటాయో తెలుసా..?
మెట్రో స్టేషన్లలో ఈ ఎల్లో టైల్స్ ఎందుకుంటాయో తెలుసా..?
చనిపోతూ పేద విద్యార్థులకు కోట్లు ఆస్తులు దానం చేసిన హీరోయిన్..
చనిపోతూ పేద విద్యార్థులకు కోట్లు ఆస్తులు దానం చేసిన హీరోయిన్..
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. ఫలితాలు రిలీజ్ అయ్యేది అప్పుడే
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. ఫలితాలు రిలీజ్ అయ్యేది అప్పుడే
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా..
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా..
వేసవిలో రోజంతా బూట్లు ధరించే వారికి అలర్ట్..
వేసవిలో రోజంతా బూట్లు ధరించే వారికి అలర్ట్..
ఏపీ, తెలంగాణకు వచ్చే 3 రోజులు వానలే వానలు
ఏపీ, తెలంగాణకు వచ్చే 3 రోజులు వానలే వానలు
గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
బాబోయ్‌ బంగారం.. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న గోల్డ్..ఈ రోజు
బాబోయ్‌ బంగారం.. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న గోల్డ్..ఈ రోజు
మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచే పండ్లు.. మీరు తింటున్నారా?
మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచే పండ్లు.. మీరు తింటున్నారా?