PM Kisan: పీఎం కిసాన్ సాయం పెంపు పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ప్చ్… రైతులకు బ్యాడ్ న్యూస్.. !

రైతులకు సాయం చేయాలనే తలంపుతో కేంద్రం సంవత్సరానికి రూ.6 వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని మూడు విడతలుగా అంటే రూ.2 వేలు చొప్పున అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఎన్నికల ఏడాది ఈ సాయాన్ని కేంద్ర పెంచుతుందని చాలా మంది భావించారు. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఈ పెంపు గురించి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

PM Kisan: పీఎం కిసాన్ సాయం పెంపు పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ప్చ్… రైతులకు బ్యాడ్ న్యూస్.. !
Pm Kisan

Updated on: Feb 07, 2024 | 6:00 PM

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. భారతదేశంలోని జీడీపీ పెంచడంలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే భారతదేశంలోని చాలా మంది రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సమయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు సాయం చేయాలనే తలంపుతో కేంద్రం సంవత్సరానికి రూ.6 వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని మూడు విడతలుగా అంటే రూ.2 వేలు చొప్పున అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఎన్నికల ఏడాది ఈ సాయాన్ని కేంద్ర పెంచుతుందని చాలా మంది భావించారు. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఈ పెంపు గురించి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి రూ.8,000-12,000కు పెంచే ప్రతిపాదన లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2019లో ప్రారంభించబడిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి రూ. 8,000-12,000కి పెంచాలని యోచిస్తోందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “ఏ ప్రతిపాదన పరిశీలనలో లేదు,” అని ఆయన అన్నారు.

పీఎం కిసాన్ పథకం కింద సాధించిన ప్రగతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ  పథకం కింద ఇప్పటివరకు 15 విడతలుగా 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు అనుబంధంగా ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాల్లో పీఎం-కిసాన్ ఒకటని ముండా చెప్పారు. రైతు-కేంద్రీకృత డిజిటల్ అవస్థాపన పథకానికి సంబంధించిన ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా చేసింది. ప్రత్యేక ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌లో పథకం ప్రారంభించినప్పటి నుండి 2,62,45,829 మంది రైతులు పీఎం-కిసాన్ ప్రయోజనాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు ధ్రువీకరించడం ఆయా రాష్ట్రాలు/యూటీల బాధ్యతని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..