భారతదేశంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే..! లిమిటెడ్‌ స్టాక్‌.. మిస్ అవ్వకండి..

|

Jun 02, 2024 | 11:30 AM

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో సాధారణ, సర్క్యూట్ బ్లూటూత్ కనెక్టివిటీ, రైడియాలజీ అప్లికేషన్, LED లైట్లు, నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS ఉన్నాయి. కవాసకి నింజా ZX-4RR అదే లిక్విడ్-కూల్డ్, 399cc, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 

భారతదేశంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే..! లిమిటెడ్‌ స్టాక్‌.. మిస్ అవ్వకండి..
Kawasaki Ninja Zx 4rr
Follow us on

ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా కవాసకి మోటార్ (IKM) శుక్రవారం భారతదేశంలో తన సూపర్ స్పోర్ట్స్ బైక్ నింజా ZX-4R న్యూ వెర్షన్ ZX-4RR ను విడుదల చేసింది. కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరను రూ.9.10 లక్షలుగా ప్రకటించింది. ఈ బైక్ కవాసకి లైనప్‌లోని నింజా ZX-4R కంటే హై రేంజ్లో ఉంది. దీని ధర రూ. 61,000 ఎక్కువ. ఈ సూపర్‌ బైక్‌ పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కవాసకి నింజా ZX-4RR భారతదేశపు అత్యంత ఖరీదైన 400cc బైక్.

ZX-4Rతో పోలిస్తే 4RR మోడల్ ఎక్స్‌ట్రా ఫీచర్లు, కొత్త రంగుతో వస్తుంది. డిజైన్ పరంగా ఈ బైక్ ZX-4R ను పోలి ఉంటుంది. కానీ ఇది ZX4R మెటాలిక్ బ్లాక్‌తో KRT మోడల్ పెయింట్ స్కీమ్‌ పద్ధతిలో డెవలప్‌ చేయబడింది. బైక్ మెయిన్‌ఫ్రేమ్ కూడా అలాగే ఉంటుంది. కానీ సస్పెన్షన్ సెటప్ భిన్నంగా ఉంటుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్స్, పూర్తిగా అడ్జెస్ట్‌ చేయగల వెనుక మోనో-షాక్ సెటప్‌ను కలిగి ఉంది.

ZX-4R నాన్-అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్‌లను, ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్‌ను పొందుతుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా తేడా లేదు. 290 mm సెమీ ఫ్లోటింగ్ ఫ్రంట్ డిస్క్‌లు, 220 mm వెనుక డిస్క్‌లు ఉన్నాయి. 4RR బైక్‌లో 4.3-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో సాధారణ, సర్క్యూట్ బ్లూటూత్ కనెక్టివిటీ, రైడియాలజీ అప్లికేషన్, LED లైట్లు, నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS ఉన్నాయి. కవాసకి నింజా ZX-4RR అదే లిక్విడ్-కూల్డ్, 399cc, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..