Kawasaki Bikes Prices: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ఏప్రిల్ నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హీరో హోండా, తదితర కంపెనీల వాహనాల ధరలను పెంచనున్నాయి. ఇక తాజాగా జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి కూడా ఏప్రిల్ 1 నుంచి తన ద్విచక్ర వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. వాహనాల తయారీకి సంబంధించి ముడి పదార్థాల ధరలు పెరగడంతో వాహనాల ధరలను పెంచనున్నట్లు చెబుతున్నాయి. దీంతో ప్రజలపై మరింత భారం కానుంది. ఇప్పటికే నిత్యావసరాల నుంచి అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలపై మరింత భారం పడుతున్న తరుణంలో వాహనాల ధరలు కూడా పెరరగడం మరింత భారం కానుంది. కవాసాకికి చెందిన నింజా స్పోర్ట్, నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ వంటి వాహన ధరలు భారీగా పెరగనున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వినియోగదారులకు షాకిచ్చింది. తన కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాల మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ తరఫున ఒక ప్రకటన విడుదల చేసింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీపై మరింత భారం పడుతోందని, ఈ కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని మోటోకార్ప్ స్పష్టం చేసింది. ప్రతి ద్విచక్ర వాహనంపై కనీసం రూ. 2500 వరకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం.. వివిధ రకాల మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది.
ఇదిలాఉంటే.. మోటోకార్ప్ బాటలోనే మరికొన్ని ఆటోమొబైల్ సంస్థలు పయనిస్తున్నాయి. తమ తమ కంపెనీలకు చెందిన వాహనాల ధరలు పెంచేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ వాహనాలపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ‘నిస్సాన్’ కూడా తమ కంపెనీకి చెందిన కార్లపై ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీకి చెంది అన్ని రకాల మోడల్ కార్లపై ధరలు పెరుగుతాయంది. అయితే ఎంతమేర పెంచుతారనేది మాత్రం వెల్లడించలేదు. ఇక పెంచిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిస్సాన్ ప్రకటించింది.
ఇవీ చదవండి: Maruti Suzuki: ఆ ఒక్క ప్రకటనతో హై స్పీడ్‌లో దూసుకుపోతున్న మారుతి సుజుకి షేర్లు..ఎందుకంటే?