రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్..! ఆ రూట్‌లో స్పెషల్ టైన్స్..
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ టౌన్ - తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నంబర్లు 07617 (ఫిబ్రవరి 14, 2026), 07618 (ఫిబ్రవరి 16, 2026) తేదీల్లో నడుస్తాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ సామర్లకోట, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

మన దేశంలో రైళ్లలో ప్రతి రోజు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా పండగలు, సెలవుల సీజన్‌లో రైళ్లలో భారీ రద్దీ ఉంటుంది. ఇలా రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్, తిరువణ్ణామలై మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
- రైలు నంబర్ 07617, కాకినాడ టౌన్ నుంచి తిరువణ్ణామలైకు శనివారం(14.02.2026) సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07618 తిరువణ్ణామలై నుంచి కాకినాడ టౌన్ సోమవారం (16.02.2026) ఉదయం 3 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.30 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కాంట్ స్టేషన్లు రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC కమ్ 2AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
