India Post Insurance: ఏడాదికి కేవలం రూ. 755 కడితే చాలు.. రూ.15 లక్షల వరకు బీమా!

| Edited By: Janardhan Veluru

Nov 05, 2024 | 12:03 PM

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 755 రూపాయల అతి తక్కువ ప్రీమియంతో 15 లక్షల ప్రమాద బీమా చెల్లించే అవకాశం కల్పించింది.

India Post Insurance: ఏడాదికి కేవలం రూ. 755 కడితే చాలు.. రూ.15 లక్షల వరకు బీమా!
Post Office
Follow us on

చాలా మంది ప్రమాద బీమా పథకంపై అశ్రద్ధ చూపుతుంటారు. సరసమైన ప్రీమియంతో ప్లాన్ అందుబాటులో ఉంటే అప్పుడు చూద్దాంలే అని వాయిదా వేసే వారు ఉంటారు. అలాంటి వారి చాలా ఉపయోగకరంగా ఉండే ప్రీమియం ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payment Bank).  ఇది భారత ప్రభుత్వ తపాలా శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ యాజమాన్యం కింద పనిచేస్తున్న భారత తపాలా శాఖకు సంబంధించిన వ్యాపార విభాగం.

ఇక్కడ అందించే బీమా పథకం చాలా మందికి ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడింది.  ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది. అవి హెల్త్ ప్లస్ మరియు ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్.

సాధారణంగా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీల కాలపరిమితి ఒక సంవత్సరం. తర్వాత దాన్ని మళ్లీ అప్‌డేట్ చేయాలి. అంటే మళ్లీ ప్రీమియం చెల్లిస్తే పాలసీ రెన్యూవల్ అవుతుంది. కొన్ని బ్యాంకులు ఆటో-రెన్యూవల్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉన్నాయి.

18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు హెల్త్ ప్లస్ తో పాటు ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకోవచ్చు.

హెల్త్ ప్లస్ ప్లాన్‌ (ఈ ప్లాన్ లో మూడు ఆఫ్షన్స్ ఉన్నాయి)

ఆఫ్షన్స్ 1: ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా, బీమా మొత్తంలో 100 శాతం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. అలాగే ప్రమాదంలో ఎముక విరిగితే బీమా మొత్తం రూ.25,000. ఈ పాలసీ కోసం మీరు సంవత్సరానికి రూ.355 చెల్లిస్తే సరిపోతుంది.

ఆఫ్షన్స్ 2: ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ రూ. 10 లక్షలు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబానికి 100 శాతం రక్షణ కూడా అందించబడుతుంది. చివరకు దహన సంస్కారాల ఖర్చు దాదాపు రూ. 5,000 పొందవచ్చు. అలాగే మృతుల పిల్లల చదువు కోసం రూ. 50,000 అందుబాటులో ఉంది. ఈ పాలసీ కోసం మీరు సంవత్సరానికి రూ.555 చెల్లించాలి.

ఆఫ్షన్స్ 3: ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ రూ. 15 లక్షలు. ఆకస్మిక మరణం లేదా ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు కుటుంబానికి 100 శాతం రక్షణ కూడా అందించబడుతుంది. మృతుల పిల్లల వివాహానికి రూ. 1 లక్ష మరియు విరిగిన ఎముకలకు రూ. 25,000 అందుబాటులో ఉంది. ఈ పాలసీ కోసం మీరు సంవత్సరానికి రూ.755 చెల్లించాలి.

 ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లాన్

ఈ ప్లాన్ కింద, మీరు రిమోట్ కన్సల్టేషన్‌లు, వార్షిక ఆరోగ్య తనిఖీ మరియు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు అన్ని వివరాలను తెలుసుకోవడం మంచిది.