Central Government: మరికొద్ది గంటలే సమయం.. ఈ పని పూర్తి చేయకపోతే రేపటి నుంచి డబ్బులు కట్..

దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ ముగియనుంది. ఈకేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు ఈ రోజుటితో పూర్తి చేయాలి.

Central Government: మరికొద్ది గంటలే సమయం.. ఈ పని పూర్తి చేయకపోతే రేపటి నుంచి డబ్బులు కట్..
June

Updated on: Jun 30, 2026 | 4:49 PM

జూన్ 30వ తేదీ వచ్చేసింది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. దీంతో అనేక సేవలకు సంబంధించిన గడువు నేటితో ముగియనుంది. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన ఈ పనులు పూర్తి చేయకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అందులో మొదటిది గ్యాస్ సబ్సిడీ. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. నేటితో పూర్తి చేయకపోతే కేంద్రం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ పూర్తిగా నిలిచిపోనుంది. ఇక ఐటీ పరిశీలన నోటీస్ గడువు తేదీ కూడా నేటితో ముగియనుంది. దీంతో నేటితో పూర్తి చేయాల్సినవి ఏంటనేది చూద్దాం.

జూన్ 30వ తేదీలోగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈకేవైసీని పూర్తి చేసేందుకు ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఇది పూర్తి చేయకపోతే ఎల్పీజీ కస్టమర్లు ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాలలో నేరుగా పొందుతున్న ఎల్‌పీజీ సబ్సిడీలు జులై 1వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. అయితే ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు యధావిధిగా ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకొని డెలివరీలను పొందగలరు. కేవైసీ పూర్తి చేయకపోతే కేవలం సబ్సిడీ చెల్లింపులు మాత్రమే నిలిచిపోతాయి. దీంతో సిలిండర్ బుకింగ్ కోసం పూర్తి సిలిండర్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ-కేవైసీ అవసరం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈకేవైసీ వేటికి అవసరమంటే..?

ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన పిఎమ్‌యువై లబ్ధిదారులు కానివారు మళ్లీ కేవైసీ చేయాల్సిన పని లేదు.

నేటితో ముగియనున్న గడువు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITRలు) దాఖలు చేయడానికి గడువు 2026 జూలై 31 వరకు ఉంది. అయితే ఇప్పటికే తమ రిటర్న్‌లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు జూన్ 30 చాలా ముఖ్యమైనది. వివరణాత్మక పరిశీలన కోసం ఎంపిక చేయబడిన అర్హత గల రిటర్న్‌లకు సెక్షన్ 143(2) కింద పరిశీలన నోటీసులను జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు నేటితో చివరి తేదీ. ITR, ఫారం 26AS, వార్షిక సమాచార నివేదిక (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS), బ్యాంకు రికార్డులు లేదా ఇతర ఆర్థిక వెల్లడింపుల ద్వారా లభించే సమాచారానికి మధ్య వ్యత్యాసాలను పన్ను అధికారులు గుర్తించినట్లయితే.. రిటర్న్‌లను పరిశీలన కోసం ఎంపిక చేయవచ్చు. అసాధారణంగా అధిక విలువ కలిగిన లావాదేవీలు, ఆదాయ నివేదనలో వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన ప్రక్రియలు లేదా సోదాలు, సర్వే కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న కేసులను కూడా ఎంపిక చేయవచ్చు.

Follow Us