మీరు పూర్తి వినోదం కోసం ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో ఉత్తమ ఎంపికలను అందిస్తుంది. జియో కొన్ని గొప్ప వినోద ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో మీరు చాలా డేటాను, 12 OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. వీటిలో అత్యంత చవకైన ప్లాన్ రూ.175. ఇదొక డేటా ప్యాక్. దీని వాలిడిటీ 28 రోజులు. ఇందులో ఇంటర్నెట్ వినియోగం కోసం కంపెనీ 10జీబీ డేటాను ఇస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు Sony Liv, Zee5, Jio సినిమాతో సహా మొత్తం 10 OTT యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో, మీరు ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఇందులో, మీరు Sony Liv, Zee5తో సహా 12 OTT యాప్‌లను ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో రోజూ 2జీబీ డేటా ఇస్తోంది. ఈ ప్లాన్‌లో కంపెనీ డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్‌కు మూడు నెలల పాటు ఉచిత యాక్సెస్‌ను ఇస్తోంది. ఈ ప్లాన్ ఉచిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. కాలింగ్ ప్రయోజనంతో కూడిన ఈ ప్లాన్‌లో కంపెనీ అమెజాన్ ప్రైమ్ లైట్, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్‌ను ఇస్తోంది.
ఇది కూడా చదవండి: EPFO: మీ కంపెనీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుందా? లేదా? తెలుసుకోవడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి