JioPC: అంబానీ సంచలన నిర్ణయం.. మీ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.. ఎలాగంటే..

Jio PC: దాదాపు 70 శాతం భారతీయ కుటుంబాలకు టీవీ ఉంది. కానీ 15 శాతం మందికి మాత్రమే కంప్యూటర్ ఉంది. జియోపీసీ కంప్యూటింగ్‌ను చౌకగా, సులభంగా చేయగలదు. ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే రిలయన్స్..

JioPC: అంబానీ సంచలన నిర్ణయం.. మీ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.. ఎలాగంటే..

Updated on: Jul 16, 2025 | 6:00 AM

భారతదేశంలోని ప్రతి ఇంటికి కంప్యూటర్లను తీసుకువస్తామని హామీ ఇచ్చే JioPC సేవను ప్రారంభించడం ద్వారా రిలయన్స్ జియో మరో పెద్ద అడుగు వేసింది. ఈ సేవ Jio సెట్ టాప్ బాక్స్ ద్వారా పనిచేస్తుంది. అలాగే వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం, ఆఫీస్ యాప్‌లను ఉపయోగించడం వంటి రోజువారీ కంప్యూటింగ్ పనుల కోసం రూపొందించారు.

ఇది కూడా చదవండి: BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్.. సిమ్‌ని ఇలా చేయండి!

జియోపీసీ అంటే ఏమిటి?

JioPC అనేది మీ టీవీని కంప్యూటర్‌గా మార్చే వర్చువల్ డెస్క్‌టాప్ సేవ. దీని కోసం మీకు Jio సెట్ టాప్ బాక్స్, అనుకూలమైన టీవీ, కీబోర్డ్-మౌస్ మాత్రమే అవసరం. JioPC Microsoft Officeకి ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయమైన LibreOfficeతో వస్తుంది. Microsoft యాప్‌లు స్థానికంగా మద్దతు ఇవ్వనప్పటికీ, మీరు వాటిని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కెమెరా, ప్రింటర్ వంటి పరికరాలకు ప్రారంభ దశలో మద్దతు లేదు. కానీ సిస్టమ్ ప్రాథమిక ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

JioPC ని ఎలా ఉపయోగించాలి?

  • టీవీ, జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయండి.
  • యాప్స్ విభాగానికి వెళ్లి JioPC యాప్‌ను ఓపెన్‌ చేయం.
  • USB లేదా బ్లూటూత్ కీబోర్డ్-మౌస్‌ను సెట్ టాప్ బాక్స్‌కు కనెక్ట్ చేయండి.
  • JioPC ఖాతాను సెటప్ చేసి మీ వివరాలను పూరించండి.
    “ఇప్పుడే ప్రారంభించు” పై క్లిక్ చేయడం ద్వారా JioPC ని ఉపయోగించడం ప్రారంభించండి.

ఎంత ఖర్చవుతుంది?

JioPC ని ఉపయోగించడానికి కస్టమర్లు Jio సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు లేదా రూ. 5,499 వన్-టైమ్ ఫీజు చెల్లించడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవ ఉచిత ట్రయల్ అందించనుంది. ఈ సేవతో రిలయన్స్ జియో మరోసారి తన వ్యవస్థను బలోపేతం చేస్తోంది. Jio ఈ చర్య డిజిటల్ ఇండియా, రిమోట్ వర్కింగ్/లెర్నింగ్‌ను కూడా వేగవంతం చేస్తుంది.

ఎవరు ప్రయోజనం పొందుతారు?

టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. జియో తన 488 మిలియన్ల వినియోగదారులను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంప్యూటర్ యాక్సెస్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సేవ గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌కు చెందిన తరుణ్ పాఠక్ అన్నారు. దాదాపు 70 శాతం భారతీయ కుటుంబాలకు టీవీ ఉంది. కానీ 15 శాతం మందికి మాత్రమే కంప్యూటర్ ఉంది. జియోపీసీ కంప్యూటింగ్‌ను చౌకగా, సులభంగా చేయగలదు. ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండనుంది.

ఇది కూడా చదవండి: Personality Test: మీ ముక్కు ఆకారం ఇలా ఉందా? మీరు ఎలాంటి వారో చెప్పేయవచ్చు!

ఇది కూడా చదవండి: SBI, Kotak Bank: మీకు ఎస్‌బీఐ, కోటాక్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా? ఈ రోజుల్లో బ్యాంకింగ్ సేవలు బంద్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి