
Jio: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోయింది. లక్షలాది మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. అక్టోబర్ నెలలో జియోకు కొత్తగా 19.97 లక్షల మంది చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది. దీంతో కంపెనీ మొబైల్ కస్టమర్లు 48.47 కోట్లకు చేరుకున్నారు. అలాగే ఎయిర్‌టెల్ వైర్‌లెస్ యూజర్లు 12.52 లక్షల మంది చేరడంతో మొత్తం సంఖ్య 39.36 కోట్లకు చేరుకున్నారు.
ట్రాయ్ వివరాల ప్రకారం.. అంతకు ముందు నెలలో 39.24 లక్షల మంది ఉన్నారు. ఇక ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు 9.25 కోట్లకు చేరారు. కానీ, వొడాఫోన్ ఐడియాకు మరోసారి భారీ షాక్ తగిలింది. గత నెలలోనూ కంపెనీ నెట్‌వర్క్ నుంచి 20.83 లక్షల మంది వెళ్లిపోయారు. దీంతో కంపెనీ మొబైల్ యూజర్లు 20 కోట్లకు పడిపోయినట్టు ట్రాయ్ తన నెలవారి సమీక్షలో వెల్లడించింది. మొత్తంమీద దేశీయంగా 123 కోట్ల మంది టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నట్టు ట్రాయ్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Rapido Rider: చేసేది రాపిడో డ్రైవర్.. ఖాతాలో రూ.331 కోట్లు.. రంగంలోకి ఈడీ.. దర్యాప్తులో కీలక విషయాలు!
మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 995.63 మిలియన్ల నుండి అక్టోబర్ చివరి నాటికి 999.81 మిలియన్లకు పెరిగింది. నెలవారీ వృద్ధి రేటు 0.42 శాతం. RJio 50.84 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ 31.26 శాతం, Vi 12.72 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
2025 సెప్టెంబర్ చివరి నాటికి 46.61 మిలియన్లుగా ఉన్న వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2025 అక్టోబర్ చివరి నాటికి 46.75 మిలియన్లకు పెరిగింది. వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో నికర పెరుగుదల 0.14 మిలియన్లు, నెలవారీ వృద్ధి రేటు 0.30 శాతం. అక్టోబర్ 2025లో వైర్‌లైన్ మార్కెట్‌లో రిలయన్స్ జియో 30.75 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 22.86 శాతం, వొడాఫోన్ ఐడియా 1.74 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మూడు PSU యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన BSNL, MTNL, APSFL వైర్‌లైన్ మార్కెట్ వాటాలో 20.22% శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Chanakya Niti: చాణక్య నీతి.. ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంటి లక్ష్మి అవుతారు!
2025 సెప్టెంబర్ 1,182.32 నాటికి వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1182.32 మిలియన్ల నుండి 2025 అక్టోబర్ చివరి నాటికి 1184.62 మిలియన్లకు పెరిగింది. తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.19 శాతంగా నమోదైంది. 2025 అక్టోబర్‌లో వైర్‌లైన్ మార్కెట్‌లో రిలయన్స్ జియో 41.36 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 33.59 శాతం, వొడాఫోన్ ఐడియా 17.13 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రెండు PSU యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన BSNL, MTNL మార్కెట్ వాటా కేవలం 7.92 శాతం మాత్రమే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి