Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డేటా లేకుండా 336 రోజుల వ్యాలిడిటీ.. ఈ రెండు ప్లాన్‌ల ధరలు తగ్గింపు!

|

Jan 27, 2025 | 7:10 PM

Reliance Jio: కొన్ని రోజుల క్రితం ట్రాయ్‌ అన్ని టెలికాం కంపెనీలను కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్‌ ఈ నియమం తర్వాత జియో కేవలం కాలింగ్, SMS తో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్‌సైట్‌లో రెండు కొత్త వాయిస్ ప్లాన్‌లను జాబితా చేసింది. దీనిలో వినియోగదారులు..

Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డేటా లేకుండా 336 రోజుల వ్యాలిడిటీ.. ఈ రెండు ప్లాన్‌ల ధరలు తగ్గింపు!
Follow us on

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, రూ. 1748 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 1958 ప్లాన్‌ను తొలగించిన తర్వాత జియో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ప్లాన్‌ల ప్రయోజనాలు ఒకేలా ఉండవు. జియో రూ.1748 ప్లాన్ వ్యాలిడిటీ కొంత తగ్గింపు ఉంటుంది. రూ.1958 ప్లాన్ 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో వచ్చింది., అయితే రూ.1748 ప్లాన్ 336 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది.

కొన్ని రోజుల క్రితం ట్రాయ్‌ అన్ని టెలికాం కంపెనీలను కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్‌ ఈ నియమం తర్వాత జియో కేవలం కాలింగ్, SMS తో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్‌సైట్‌లో రెండు కొత్త వాయిస్ ప్లాన్‌లను జాబితా చేసింది. దీనిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ చెల్లుబాటును పొందుతారు. డేటాను ఉపయోగించని వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. జియో ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే ఉపయోగించి, డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

84 రోజుల జియో ప్లాన్:

ఇవి కూడా చదవండి

రిలయన్స్ జియో తన రూ. 458 ప్లాన్ ధరను రూ. 448కి తగ్గించింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యవధిలో అపరిమిత వాయిస్ కాల్‌లు, 1,000 SMSలను అందిస్తోంది. ఇది కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. కాలింగ్, SMS మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం అందిస్తుంది.

జియో 365 రోజుల ప్లాన్:

జియో కొత్త రూ.1748 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల సుదీర్ఘ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత SMS, ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ Jio సినిమా, Jio TV వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. తద్వారా వినియోగదారులు కూడా పూర్తి వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి