Jio OTT: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరల్లోనే ఓటీటీ ప్లాన్స్‌

Jio OTT Plans: రియలన్స్‌ జియో తన వినియోగదారుల కోసం రకరకాల ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తక్కువ ధరల్లోనే ఓటీటీ ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. ఎక్కువ మొత్తంలో రీఛార్జ్‌ చేయకుండా తక్కువ ధరలలో ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. మీకు ఓటీటీ కంటెంట్‌ చూసే అలవాటు ఉంటే ఈ ప్లాన్‌లను తెలుసుకోవడం మంచిది..

Jio OTT: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరల్లోనే ఓటీటీ ప్లాన్స్‌

Updated on: Jul 31, 2025 | 1:38 PM

భారతీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు వివిధ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే వారికి OTT సేవల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మంచి విషయం ఏమిటంటే మీరు ఉచిత OTT కోరుకుంటే ఖరీదైన ప్లాన్‌లతో రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. OTT ఆనందాన్ని అందించే రూ. 500 కంటే తక్కువ ధర గల ప్లాన్‌లను అందిస్తోంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు!

100 రూపాయల ఉచిత OTT ప్లాన్:

ఇవి కూడా చదవండి

100 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ ఉచిత OTT ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో పాటు 5GB అదనపు డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ 90 రోజుల పాటు JioHotstar (మొబైల్/టీవీ) యాక్సెస్‌ను అందిస్తోంది.

Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లను ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసా..? వీటి మధ్య తేడా ఏమిటి?

175 రూపాయల ఉచిత OTT ప్లాన్:

మీరు ఒకే ప్లాన్‌లో 10 OTT సేవల ప్రయోజనాన్ని కోరుకుంటే ఈ రీఛార్జ్ టారిఫ్ ఉత్తమమైనది. ఇది కూడా డేటా-ఓన్లీ ప్లాన్, 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 10GB అదనపు డేటాను అందిస్తున్నారు. ఈ సేవల జాబితాలో Sony LIV, ZEE5, లయన్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కాంచా లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్ మొదలైనవి ఉన్నాయి.

195 రూపాయల ఉచిత OTT ప్లాన్: జియో ఈ డేటా మాత్రమే ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మొత్తం 15GB అదనపు డేటాను అందిస్తోంది. దీనితో రీఛార్జ్ చేసుకుంటే, జియో హాట్‌స్టార్ (మొబైల్/టీవీ) సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!

329 రూపాయల ఉచిత OTT ప్లాన్:

మీరు ప్రకటన రహిత సంగీత అనుభవాన్ని కోరుకుంటే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం మంచిది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 1.5GB చొప్పున మొత్తం 42GB రోజువారీ డేటాను అందిస్తుంది. JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో అందిస్తోంది. JioTVతో పాటు, JioAICloud యాప్‌లకు యాక్సెస్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: Gold, Silver Rate: మగువలకు ఉపశమనం.. భారీగా తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి