Jio cinema: జియో సినిమా సరికొత్త చరిత్ర.. ఈసారి ఐపీఎల్‌ను ఎన్ని కోట్ల మంది చూశారంటే

ఐపీఎల్‌2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా ఏకంగా 62 కోట్ల మంది క్రికెట్‌ను వీక్షించారు. గతేడాది చూసిన వారితో పోల్సితే ఇది ఏకంగా 53 శాతం అధికం కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఏకంగా 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను జియో సినిమా నమోదు చేసింది. ఇది ఓటీటీ వేదికల్లో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు...

Jio cinema: జియో సినిమా సరికొత్త చరిత్ర.. ఈసారి ఐపీఎల్‌ను ఎన్ని కోట్ల మంది చూశారంటే
Jio Cinema Ipl

Updated on: May 30, 2024 | 4:54 PM

ప్రముఖ టెలికం సంస్థ జియోకు చెందిన జియో సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ను జియో సినిమాలో ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది జియో. ఈ సీజన్‌లో రికార్డ్‌ స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకొని సరికొత్త చరిత్రను సృష్టించింది.

ఐపీఎల్‌2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా ఏకంగా 62 కోట్ల మంది క్రికెట్‌ను వీక్షించారు. గతేడాది చూసిన వారితో పోల్సితే ఇది ఏకంగా 53 శాతం అధికం కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఏకంగా 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను జియో సినిమా నమోదు చేసింది. ఇది ఓటీటీ వేదికల్లో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే 2024 ఐపీఎల్ సీజన్‌ మొదటి రోజున జరిగిన మ్యాచ్‌ను 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది మొదటి రోజున వీక్షించిన వారితో పోల్చితే ఇది 51 శాతం అధికం కావడం విశేషం. వీక్షకులు సెషన్‌కు సగటున 75 నిమిషాలు కేటాయించినట్లు జియో తెలిపింది. గతేడాది ఈ సమయం 60 నిమిషాలుగా ఉండేది. ఇదిలా ఉంటే జియో సినిమాలో వీడియో నాణ్యతను మరింత పెంచడం కూడా వ్యూయర్‌షిప్‌ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. 4కే వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్‌ ఆప్షన్స్‌, 12 భాషల్లో ఫీడ్‌తో పాటు అదనంగా ఆర్‌/వీఆర్‌ వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా ఈ రికార్డు సాధించడానికి కారణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌తో సరికొత్త రికార్డును సృష్టించిన జియో సినిమా ఇప్పుడు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ జియి సినిమాలో టెలికాస్ట్‌ చేయనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రకటన సైతం విడుదల చేసింది. జులై 26వ తేదీ నుంచి జరగనున్న ఒలింపిక్స్‌ను జియో సినిమాతో పాటు 18 స్పోర్ట్స్‌లో వీక్షించే అవకాశం కల్పించనున్నారు. మొత్తం మీద ఓటీటీ వేదికల్లో జియో సినిమా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..