Jio: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. తాజా నివేదిక విడుదల చేసిన ట్రాయ్‌

| Edited By: Subhash Goud

Jul 13, 2021 | 9:01 PM

Reliance Jio New Subscribers: రిలయన్స్‌ జియో కస్టమర్లను పెంచుకునేందుకు మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణా టెలికాం సర్కిల్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని..

Jio: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. తాజా నివేదిక విడుదల చేసిన ట్రాయ్‌
Follow us on

Reliance Jio New Subscribers: రిలయన్స్‌ జియో కస్టమర్లను పెంచుకునేందుకు మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణా టెలికాం సర్కిల్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన టెలికాం చందాదారుల డేటా ప్రకారం.. రిలయన్స్ జియో 2021 ఏప్రిల్ నెలలో 1.28 లక్షలకు పైగా కొత్త చందాదారులను సంపాదించుకుంది. అయితే ఈ సర్కిల్‌లో కొత్త చందాదారులను చేర్చుకున్న ఏకైక టెలికాం ఆపరేటర్ సంస్థ జియోగా నిలిచినట్లు ట్రాయ్‌ పేర్కొంది. జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 3.21 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో విస్తరించింది.

కాగా, 2021 ఏప్రిల్‌లో రిలయన్స్ జియో అత్యధికంగా 1,28,098 మొబైల్ చందాదారులను చేర్చినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. ఎయిర్‌టెల్ ఈ నెలలో 2,236 మొబైల్ చందాదారులను కోల్పోగా, వోడాఫోన్ ఐడియా 1,64,955 మంది చందాదారులను కోల్పోయింది, అదే నెలలో బిఎస్‌ఎన్‌ఎల్ 78,087 మంది సభ్యులను కోల్పోయినట్లు ట్రాయ్ తన నివేదికలో వెల్లడించింది. జాతీయంగా కూడా, రిలయన్స్ జియో ఏప్రిల్ నెలలో చందాదారుల విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ఈ నెలలో 47.56 లక్షల మంది వినియోగదారులను చేర్చింది. ఈ అదనంగా, జియో చందాదారుల సంఖ్య 42.76 కోట్లకు పైగా పెరిగింది.

ఇతర నెట్‌ వర్క్‌లు:

కాగా, భారతీ ఎయిర్‌టెల్ నెలలో 5.17 లక్షలకు పైగా వినియోగదారులను చేర్చుకుంది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్‌ చందారుల సంఖ్య 35.29 కోట్లకు పైగా ఉంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా తన చందాదారుల సంఖ్యను 18.10 లక్షలకు పైగా వినియోగదారులను కోల్పోయి 28.19 కోట్లకు పడిపోయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల సంఖ్య దాదాపు 13.05 లక్షలు తగ్గి 11.72 కోట్లకు పడిపోయింది.

ఇవీ కూడా చదవండి:

SBI General Insurance: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ ఆరోగ్య సుప్రీం బీమా పాలసీ.. రూ.5 కోట్ల వరకు బీమా కవరేజ్‌..!

BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. ఎంతంటే..!