ITR Filing: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కి సంబంధించి 3.7 కోట్ల మంది ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈనెల 31తో గడువు ముగియనుంది. అయితే ఈనెల 17 నాటికి ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో 3,71,74,810 మంది ఐటీఆర్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
డిసెంబర్ చివరి నాటికి ఐటీఆర్ దాఖలు చేయనివారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.10వేల వరకు ఆ జరిమానా విధిస్తారు. అయితే వారి ఆదాయం రూ.5 లక్షలు దాటకుంటే ఆలస్య రుసుము రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. గడువు ముగిసిన తర్వాత జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేసేవారికి పలు మినహాయింపులు వర్తించవు. ఆదాయం పన్ను చట్టంలోని 10ఏ, 10బీ సెక్షన్ల కింద మినహాయింపు క్లయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసేవారికి ఆదాయం పన్ను సెక్షన్‌లో 80ఐఏ, 80 ఐఏబీ, 80ఐసీ, 80ఐడీ, 80ఐఈ సెక్షన్ల కింద మినహాయింపులు ఉండవు.
ఇవి కూడా చదవండి