IT Returns: ఆర్థిక సంవత్సరానికి 4.51 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు.. దరఖాస్తులకు సమయం దగ్గర పడుతోంది..!

|

Dec 28, 2021 | 2:29 PM

IT Returns: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిసెంబర్‌ 31 వరకు గడువు ఉన్న విషయం..

IT Returns: ఆర్థిక సంవత్సరానికి 4.51 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు.. దరఖాస్తులకు సమయం దగ్గర పడుతోంది..!
Follow us on

IT Returns: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిసెంబర్‌ 31 వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం గడువును పొడిగించే అవకాశం ఉందని సీఎన్‌బీసీ పేర్కొంది. ఇక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ 26 వరకు 4.51 కోట్లకుపైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఆదివారం ఒక్క రోజే 8,77,721 ఐటీఆర్‌లు దాఖలైనట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు వచ్చిన 4.51 కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్‌-1లు 2.44 కోట్లు, ఐటీఆర్‌-4లు 1.12 కోట్లు ఉన్నాయని తెలిపింది. 2019-20లో 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. అయితే రూ.50 లక్షల ఆదాయం ఉంటే ఐటీఆర్ ఫామ్ 1 (సహజ్) సమర్పిస్తారు. అలాగే వేతనం, వన్ హౌస్ ప్రాపర్టీ, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు కూడా దీనిని సమర్పిస్తారు. ఐటీఆర్-4ను రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన బిజినెస్, ప్రొఫెషనల్ ఇండివిడ్యువల్స్‌, హెచ్‌యూఎఫ్‌ఎస్‌ సమర్పిస్తారు.

ఇక ఐటీ రిటర్న్‌లు గడువులోగా దాఖలు చేయకుంటే వినియోగదారులు ప్రస్తుత ఏడాదికి తమ నష్టాలను క్వారీ ఫార్వార్డ్‌ చేసుకునే వెసులుబాటును కోల్పోతారు. గడువులోగా దాఖలు చేయకుంటే రూ.5 లక్షలకుపై ఆదాయం ఉన్న వారు రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5,000 లక్షలకు లోపు ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా చేసినట్లయితే వడ్డీ ప్రయోజనం సైతం కోల్పోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Air India: టాటా గ్రూప్‌కు ఎయిర్‌ ఇండియా అప్పగింత మరింత ఆలస్యం..!

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!

Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!