Income Tax Return News: సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఉంటుందా? చట్టం ఏం చెబుతుందంటే..!

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం నుంచి సీనియర్ సిటిజన్‌లకు ఎలాంటి మినహాయింపు ఉండదు. అయితే భారతీయ నివాసితులైన వారు పేర్కొన్న పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తే పన్ను విధించవచ్చు. అలాంటి సీనియర్ సిటిజన్లు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

Income Tax Return News: సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఉంటుందా? చట్టం ఏం చెబుతుందంటే..!
Income Tax Return

Updated on: Apr 07, 2023 | 6:30 PM

సాధారణంగా వ్యక్తి సంపాదనను బేరీజు వేసుకుని ఆదాయపు పన్ను చెల్లింపు అనేది ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అనే అనుమానం అందరికీ ఉంటుంది. దీని గురించి ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు ఎలా ఉన్నాయో? ఓసారి చూద్దాం. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం నుంచి సీనియర్ సిటిజన్‌లకు ఎలాంటి మినహాయింపు ఉండదు. అయితే భారతీయ నివాసితులైన వారు పేర్కొన్న పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తే పన్ను విధించవచ్చు. అలాంటి సీనియర్ సిటిజన్లు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిన వ్యక్తులు లేదా చెల్లించిన ఏవైనా పన్నుల వాపసును క్లెయిమ్ చేయాలనుకునే వ్యక్తులు ఐటీఆర్ ఫైల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది. ఈ చర్య పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ట్రాక్ చేయడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. వారు సరైన మొత్తంలో పన్ను చెల్లించేలా చూస్తుంది.

సీనియర్ సిటిజన్, సూపర్ సిటిజన్ మధ్య తేడాలివే..

ఎవరైనా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి,80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం సీనియర్ సిటిజన్‌గా పరిగణిస్తారు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని సూపర్ సీనియర్ సిటిజన్‌గా పరిగణిస్తారు. 

సీనియర్ సిటిజన్లకు అందే ప్రయోజనాలు ఇవే

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం సీనియర్ సిటిజన్‌లకుఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం నుంచి ఎలాంటి మినహాయింపును అందించదు. అయినప్పటికీ సీనియర్ సిటిజన్‌లకు (వారి వయస్సు 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) ఉపశమనం కలిగించడానికి ఆర్థిక చట్టం, 2021, సెక్షన్ 194పీ ప్రకారం కొన్ని లాభాలున్నాయి. సదరు వ్యక్తి తన పెన్షన్  ఖాతాని నిర్వహిస్తుంటే, బ్యాంక్ ఈ నిబంధన కింద అతనికి పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తుంది. అయితే సెక్షన్ 87ఏప్రకారం తగ్గింపును పొందే వ్యక్తి ఆదాయాన్ని కూడా గణించాలి. అలాంటి ఆదాయంపై విధించే పన్నును ప్రస్తుతం అమలులో ఉన్న రేట్ల ఆధారంగా తీసేయాలి. అలాగే మినహాయించిన పన్నును మునుపటి సంవత్సరానికి సంబంధించిన ఆదాయ రిటర్న్‌ను అందించడానికి ఎలాంటి బాధ్యత ఉండదు.

ఇవి కూడా చదవండి

సూపర్ సీనియర్ సిటిజన్లకు అందే ప్రయోజనాలు

సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అధిక మినహాయింపు పరిమితిని మంజూరు చేస్తారు. మినహాయింపు పరిమితి అంటే ఒక వ్యక్తి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని ఆదాయ పరిమాణం అని అర్థం. నాన్-సీనియర్ సిటిజన్‌లతో పోలిస్తే సీనియర్ సిటిజన్‌కు అధిక మినహాయింపు పరిమితి ఇస్తారు. రెసిడెంట్ సీనియర్ సిటిజన్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరానికి మినహాయింపు పరిమితి రూ. 3,00,000. సీనియర్ సిటిజన్లు కాని వారికి మినహాయింపు పరిమితి రూ. 2,50,000గా ఉంది. రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరానికి మినహాయింపు పరిమితి రూ. 5,00,000గా ఉంది. అయితే, ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద రూ.12,500 వరకు రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ కేవలం నివాసితులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎన్ఆర్ఐలు, హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ సెక్షన్ కింద రాయితీ మంజూరు చేయరనే విషయాన్ని గమనించాలి.  

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..