SIP Investment: కోటీశ్వరుడు కావడం మీ కలా? ఆ పథకంలో 15 ఏళ్ల పెట్టుబడితో మీ కల సాకారం

| Edited By: Ram Naramaneni

Nov 16, 2023 | 9:21 PM

మీరు ఎస్‌ఐపీ ద్వారా ఎక్కువ కాలం వాటిలో పెట్టుబడి పెడితే మిమ్మల్ని మీరు కోటీశ్వరులను కూడా చేసుకోవచ్చు. మార్కెట్ లింక్ అయినందున ఎస్‌ఐపీల్లో ఎలాంటి హామీ రాబడి ఉండదు. దీని రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.కానీ దీర్ఘకాలికంగా ఇది 15 నుంచి 20 శాతం వరకు రాబడిని కూడా ఇస్తున్నారు. దీని సగటు రాబడి 12 శాతంగా పరిగణిస్తారు. అలాగే వీటిల్లో పెట్టుబడి మీకు చక్రవడ్డీ ప్రయోజనం అందిస్తుంది.

SIP Investment: కోటీశ్వరుడు కావడం మీ కలా? ఆ పథకంలో 15 ఏళ్ల పెట్టుబడితో మీ కల సాకారం
Investment
Follow us on

కష్టపడి సంపాదించిన సొమ్ముకు మంచి రాబడి కోసం వివిధ పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటూ ఉంటారు. అయితే స్థిర ఆదాయం కోసం ఎదురు చూసే ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెడితే  భారీ కార్పస్‌ని సృష్టించాలనుకునే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు.  మీరు ఎస్‌ఐపీ ద్వారా ఎక్కువ కాలం వాటిలో పెట్టుబడి పెడితే మిమ్మల్ని మీరు కోటీశ్వరులను కూడా చేసుకోవచ్చు. మార్కెట్ లింక్ అయినందున ఎస్‌ఐపీల్లో ఎలాంటి హామీ రాబడి ఉండదు. దీని రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.కానీ దీర్ఘకాలికంగా ఇది 15 నుంచి 20 శాతం వరకు రాబడిని కూడా ఇస్తున్నారు. దీని సగటు రాబడి 12 శాతంగా పరిగణిస్తారు. అలాగే వీటిల్లో పెట్టుబడి మీకు చక్రవడ్డీ ప్రయోజనం అందిస్తుంది. కాబట్టి 15 ఏళ్లల్లో కోటీశ్వరులు అవ్వాలంటే కచ్చితంగా ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ నేపథ్యంలో కోటీశ్వరుడు ఎలా అవ్వాలో? ఓసారి తెలుసుకుందాం. 

15X15X15 సూత్రం

15X15X15 ఫార్ములా ప్రకారం మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెట్టాలి, దీనిలో మీరు 15 శాతం వడ్డీని పొందవచ్చు. ఎస్‌ఐపీల్లో దీర్ఘకాలికంగా 15 శాతం రాబడిని పొందడం పెద్ద విషయం కాదు. మీరు 15X15X15 సూత్రాన్ని అనుసరించి ఎస్‌ఐపీల్లో నెలకు రూ. 15,000 చొప్పున పెట్టుబడి పెడితే మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ. 27,00,000 పెట్టుబడి పెడతారు. కానీ మీరు దానిపై 15 శాతం వడ్డీని పొందినట్లయితే, అది రూ.74,52,946గా మారుతుంది.ఇలా ఇన్వెస్ట్ చేసిన మొత్తం, వడ్డీ కలిపితే 15 ఏళ్లలో రూ.1,01,52,946 ఫండ్ సిద్ధమవుతుంది.

త్వరగా పెట్టుబడితో మేలు

మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత త్వరగా కోటీశ్వరులుగా మారవచ్చు. మీరు 25 సంవత్సరాల వయస్సులో 15X15X15 సూత్రం ప్రకారం పెట్టుబడి పెడితే మీరు 40 సంవత్సరాల వయస్సులో కోటీశ్వరులుగా మారవచ్చు. అయితే దీనికి మీ ఆదాయం నెలకు దాదాపు రూ.80,000 ఉండాలి. ఆర్థిక నిబంధనల ప్రకారం ప్రతి నెలా 20 శాతం ఆదాయం పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలి. మీ నెలవారీ ఆదాయం రూ. 80,000 అయితే, మీరు ప్రతి నెలా రూ. 16,000 లేదా మీ ఆదాయంలో 20 శాతం ఆదా చేసుకోవాలి. అలాంటి  మీరు ఎస్‌ఐపీల్లో నెలకు రూ. 15,000 సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి