మన సమాజంలో ఎఫ్ డీలకు అంతటి ప్రాధాన్యం ఉంది. నిర్ణీత సమయానికి వడ్డీతో కలిసి పెట్టుబడిని తిరిగి తీసుకునే అవకాశం ఉండటం, మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకపోవడమే ఎఫ్ డీల మనుగడకు ప్రధాన కారణం. అయితే నిర్ణీత కాలవ్యవధి కంటే ముందుగానే ఎఫ్ డీలో డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది. బ్యాంకులు ఏమైనా చార్జీలు వసూలు చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అన్ని బ్యాంకుల్లో ఎఫ్ డీ పథకాలు అమలవుతున్నాయి. ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆయా బ్యాంకులు తమ నిబంధనల మేరకు వడ్డీరేట్లను అమలు చేస్తాయి. ఇది బ్యాంకుల వారీగా మారుతుంది.
సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీరేట్లు అమలవుతాయి. కాబట్టి సురక్షితమైన, నమ్మకమైన, వడ్డీ ఎక్కువ ఇచ్చే బ్యాంకును ఎంపిక చేసుకుని డబ్బులను డిపాజిట్ చేయాలి. ఎఫ్ డీకి నిర్ణీత కాలవ్యవధి ముగిసిన తర్వాత వడ్డీతో కలిసి అసలును చేతికిచ్చేస్తారు. కానీ అత్యవసర పరిస్థితులు, అవసరాలు తదితర వాటి కోసం ముందుగానే ఎఫ్ డీని రద్దు చేయాలనుకుంటే బ్యాంకులు వసూలు చేసే చార్జీలు ఈ కింద తెలిపిన విధంగా ఉంటాయి. మెచ్యురిటీ తేదీ కన్నా ముందుగానే ఎఫ్ డీని రద్దు చేసుకుంటే దాన్ని ముందస్తు ఉపసంహరణ అంటారు. దీనికి బ్యాంకులు సాధారణంగా పెనాల్టీని విధిస్తాయి. ఇది చివరి వడ్డీ చెల్లింపు నుంచి కట్ చేస్తాయి. లేకపోతే పెట్టుబడిని తిరిగి ఇచ్చేటప్పుడు తీసి వేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి