Financial Crisis: భారత్ కూడా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదా..? నిపుణులు ఏమంటున్నారంటే..

|

May 21, 2022 | 5:38 PM

Financial Crisis: ఒకవైపు డిమాండ్ పడిపోవడంతో పాటు మాంద్యం ధోరణితో ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ధరలు కూడా పెరుగుతున్నాయి.

Financial Crisis: భారత్ కూడా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Financial Crisis
Follow us on

Financial Crisis: ఒకవైపు డిమాండ్ పడిపోవడంతో పాటు మాంద్యం ధోరణితో ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని చాలా తేలికగా తీసుకున్నాయని ఆర్థిక నిపుణులు స్వామినాథన్ అయ్యర్ అన్నారు. స్తబ్దత సంకేతాలు చుట్టూ ఉన్నాయి. శ్రీలంక లేదా పాకిస్తాన్ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకపోవచ్చని ఆయన అంటున్నారు. కానీ మనదేశం ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

కొన్నేళ్ల నుంచి అత్యధిక ద్రవ్యోల్బణంలో ఉన్నామని.. ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ కేవలం 15.05% వద్ద, వినియోగదారు ధర సూచిక 7.8% వద్ద ఉంది. ఇవి అసాధారణంగా అధిక రేట్లు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2% లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. తాజాగా అక్కడ ఆ రేటు 8.5% నుంచి స్వల్పంగా తగ్గి 8.3%గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆవరించి ఉంది. దీనికారణంగా.. వస్తువులు, సేవలు, తయారీ ధరలు గత 12 నెలలుగా పెరుగుతున్నాయి.

ద్రవ్యోల్బణం పెరగటం 2021లో ప్రారంభమైంది. ఆ తరువాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం దానిని వేగవంతం చేసింది. ప్రపంచం ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణ ఉచ్చులో చిక్కుకుంది. పెద్ద సంఖ్యలో వస్తువుల కొరత కాలక్రమేణా పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో వస్తువుల ముఖ్యమైన సరఫరాదారు అయిన రష్యాపై యుద్ధం కారణంగా విధించిన ఆంక్షలు ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. రష్యా – ఉక్రెయిన్ నుంచి అతిపెద్ద సరఫరా మార్గాల్లో ఒకటైన నల్ల సముద్రం యుద్ధం కారణంగా నిరోధించబడింది. దీనివల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినటమే కాక.. వస్తువుల తరలింపు మరింత ఖరీదుగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

వీటన్నింటికీ మించి కొవిడ్‌ను అరికట్టడానికి చైనా పూర్తిగా లాక్‌డౌన్ విధించటంతో.. అనేక దేశాలు ప్రభావితం అవుతున్నాయి. అనేక కీలక ముడిపదార్థాలు దిగుమతి నిలిచిపోవటం, ఆలస్యం కావటం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోంది. ఒక వైపు మాంద్యం, మరో పక్క అధిక ధరల కారణంగా డిమాండ్ పడిపోవటం వల్ల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయి. కొంత మంది దీనిని స్టాగ్‌ఫ్లేషన్ అని అంటున్నారు. కానీ ఇదే సమయంలో రిజర్వు బ్యాంక్ కేవలం వడ్డీ రేట్లును పెంచటం వల్ల ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి వస్తుందా.. ఈ చర్యలు పరిస్థితులను పూర్వ స్థితికి తెచ్చేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయి అనే అంశాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి