IPO: స్టాక్ మార్కెట్ లో ఐపీవో హంగామా.. అక్టోబర్ లో రానున్న కంపెనీలు ఇవే..!

|

Sep 30, 2024 | 6:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రికెట్ లీగ్ జరిగే దాదాపు రెండు నెలల పాటు ఎక్కడ చూసినా దాని పైనే చర్చ జరుగుతుంది. మ్యాచ్ ల తీరు, ఆటగాళ్ల ప్రతిభ, స్డేడియంలో అభిమానుల సందడికి సంబంధించిన వార్తలు, విశేషాలతో సందడిగా ఉంటుంది. ఇదే విధంగా స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం ఐపీవో సందడి నెలకొంది. ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. దీనిలో వివిధ కంపెనీలు తమ షేర్లను విక్రయిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారందరూ ఐపీవోకు వచ్చే కంపెనీల కోసం ఎదురుచూస్తుంటారు.

IPO: స్టాక్ మార్కెట్ లో ఐపీవో హంగామా.. అక్టోబర్ లో రానున్న కంపెనీలు ఇవే..!
Stock Market
Image Credit source: Reuters/Francis Mascarenhas
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రికెట్ లీగ్ జరిగే దాదాపు రెండు నెలల పాటు ఎక్కడ చూసినా దాని పైనే చర్చ జరుగుతుంది. మ్యాచ్ ల తీరు, ఆటగాళ్ల ప్రతిభ, స్డేడియంలో అభిమానుల సందడికి సంబంధించిన వార్తలు, విశేషాలతో సందడిగా ఉంటుంది. ఇదే విధంగా స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం ఐపీవో సందడి నెలకొంది. ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. దీనిలో వివిధ కంపెనీలు తమ షేర్లను విక్రయిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారందరూ ఐపీవోకు వచ్చే కంపెనీల కోసం ఎదురుచూస్తుంటారు. దేశంలో ఇప్పుడు ఐపీవో సందడి నెలకొంది. సెప్టెంబర్ నెలతో ఈ హడావుడి ఆగిపోతుందని భావించారు.  అయితే అక్టోబర్ లో ప్రముఖ కంపెనీలు ఐపీవోకు రానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో జోష్ కొనసాగుతుంది. 

ఈ ఏడాది సెప్టెంబర్ లో పలు కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. నెలంతా స్టాక్ మార్కెట్ లో సందడి బాాగా నెలకొంది. దాదాపు 14 ఏళ్లలో అత్యంత రద్దీగా లావాదేవీలు ఈ నెలలో జరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కితాబు ఇచ్చింది. సెప్టెంబర్ పూర్తవడంతో సందడి తగ్గిపోతుందని అందరూ భావించారు. అయితే అక్టోబర్ నుంచి అర డజను కంటే ఎక్కువ కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. రాబోయే అరవై రోజుల్లో రూ.60 వేల కోట్లను సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.  హ్యుందాయ్ మోటార్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తదితర పెద్ద కంపెనీలతో పాటు ఆఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వారీ ఎనర్జీస్, నివాబుపా హెల్త్ ఇన్స్యూరెన్స్ , వన్ మెబిక్విక్ సిస్టమ్స్, గరుడ కన్ స్ట్రక్షన్స్ కూడా రానున్నాయి. 

ఐపీవో అంటే..

కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడం, ఉత్పత్తిని పెంచడం కోసం మూలధనం చాలా అవసరం. అందుకే అవి ఐపీవోకు వచ్చి తమ వాటాలను ప్రజలకు విక్రయిస్తాయి. దీని ద్వారా మూలధనాన్ని సమకూర్చుకుని వ్యాపార విస్తరణకు ఉపయోగించుకుంటాయి. ఐపీవో లో వచ్చిన సొమ్మును వ్యాపార విస్తరణకు ఎలా ఉపయోగిస్తామనే విషయాన్ని కూడా ఆయా కంపెనీలు తెలియజేస్తాయి. సెక్యూరీటీ ఎక్స్చేంచ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి తీసుకుని ఐపీవోకు రావాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

హ్యందాయ్ మోటార్ ఇండియా

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ ఇది. అక్టోబర్ లో ఐపీవోకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా రూ.25 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన వాటిలో ఇదే పెద్ద ఐపీవో. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఎల్ఐసీ పేరుమీద ఉంది. అప్పట్లో ఆ సంస్థ ఐపీవోలో రూ.21 వేల కోట్లు సేకరించింది.  

స్విగ్గీ

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ సరఫరా కంపెనీ అయిన స్విగ్గీ ఐపీవోకు రానుంది. దీని ద్వారా రూ.10,414 కోట్ల సేకరించాలని చూస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఈ మొత్తం సేకరించనుంది.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ సంస్థకు చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం ఇది. ఈ కంపెనీ నవంబర్ లో ఐపీవోక రానుంది. దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..