iPhone 17 Air: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే వార్త.. 17 ఎయిర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!

ఐఫోన్ 17 ఎయిర్ 6.6-అంగుళాల OLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. యాపిల్ ఈ ఫోన్‌ను సన్నగా, బరువు తక్కువగా రూపొందించడంపై దృష్టి పెట్టింది. దీని మందం కేవలం 5.5 మి.మీ, బరువు సుమారు 145 గ్రాములు ఉంటుందని అంచనా. ఇది యాపిల్ సంస్థలో ఇప్పటివరకు వచ్చిన ఫోన్‌లలో కెల్లా అత్యంత సన్నని ఫోన్ అవుతుంది. ఫోన్ లోపల, యాపిల్ A19 చిప్, 8GB ర్యామ్ ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 2800mAh వరకు ఉండవచ్చు. కెమెరా విషయంలో వెనుక ఒకే సెన్సార్ ఉన్నా, యాపిల్ ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీ అందించవచ్చు.

iPhone 17 Air: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే వార్త..  17 ఎయిర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
Iphone Air Launch Features Price

Updated on: Jul 14, 2025 | 5:43 PM

యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 ఎయిర్ను త్వరలో విడుదల చేయనుంది. దీని డిజైన్, ఫీచర్లు, ప్రత్యేక రంగుల గురించి ఇప్పటికే కొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. సెప్టెంబర్ 2025లో ఈ కొత్త ఐఫోన్ల సిరీస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కొత్త లైనప్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ తో పాటు, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ కూడా ఉంటుంది. ఈ కొత్త మోడల్ చాలా నాజూకైన డిజైన్‌తో (6 మి.మీ కన్నా తక్కువ మందం) ప్రత్యేకంగా నిలవనుంది. ఇది Samsung Galaxy S25 Edge వంటి ఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం…

కలర్స్ (అంచనా):

Majin Buu, Fixed Focus Digital లాంటి టిప్‌స్టర్‌లు తెలిపిన ప్రకారం, ఐఫోన్ 17 ఎయిర్ నాలుగు రంగులలో లభించవచ్చు. అవి క్లాసిక్ బ్లాక్, సిల్వర్, లైట్ గోల్డ్, లైట్ బ్లూ. లైట్ బ్లూ రంగు గత యాపిల్ బ్లూ రంగుల కన్నా భిన్నంగా, MacBook Air M4 లోని స్కై బ్లూ రంగు పోలి ఉంటుంది.

డిజైన్, ప్రత్యేకతలు (అంచనా):

ఐఫోన్ 17 ఎయిర్ 6.6-అంగుళాల OLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. యాపిల్ ఈ ఫోన్‌ను సన్నగా, బరువు తక్కువగా రూపొందించడంపై దృష్టి పెట్టింది. దీని మందం కేవలం 5.5 మి.మీ, బరువు సుమారు 145 గ్రాములు ఉంటుందని అంచనా. ఇది యాపిల్ సంస్థలో ఇప్పటివరకు వచ్చిన ఫోన్‌లలో కెల్లా అత్యంత సన్నని ఫోన్ అవుతుంది. ఫోన్ లోపల, యాపిల్ A19 చిప్, 8GB ర్యామ్ ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 2800mAh వరకు ఉండవచ్చు. కెమెరా విషయంలో వెనుక ఒకే సెన్సార్ ఉన్నా, యాపిల్ ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీ అందించవచ్చు. ఈ ఫీచర్ 2x ఆప్టికల్-క్వాలిటీ జూమ్ సామర్థ్యం ఇస్తుంది. ఇది తేలికైన ఫోన్ అయినా, ఫొటో సామర్థ్యాలు పెరుగుతాయి.

ధరలు (అంచనా):

భారత్‌లో ఐఫోన్ 17 ఎయిర్ ధర సుమారు రూ. 89,900 ఉండవచ్చు. అమెరికాలో 899 డాలర్లు, దుబాయ్‌లో AED 3,799 ధర ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో జరిగే ఈవెంట్‌లో యాపిల్ ఈ ఫోన్‌ను, ఇతర ఐఫోన్ 17 సిరీస్ మోడళ్లతో పాటు లాంచ్ చేయవచ్చు. అధికారిక విడుదల తర్వాత త్వరలోనే ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.