FD Interest Rates: ఫిక్స్డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల భూమ్‌.. ఆ బ్యాంకుల్లో అదిరిపోయే వడ్డీ రేట్లు ఇవే

|

Jul 07, 2023 | 4:45 PM

ఆర్‌బీఐ తన గత ద్రవ్య విధానంలో కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే ప్రస్తుతం వడ్డీ రేట్లు గతంలో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ ఐదేళ్ల నుంచి పోలిస్తే ఇవే అధిక వడ్డీ రేట్లు అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏయే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

FD Interest Rates: ఫిక్స్డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల భూమ్‌.. ఆ బ్యాంకుల్లో అదిరిపోయే వడ్డీ రేట్లు ఇవే
Fixed Deposit
Follow us on

భారతదేశంలో మే 2022 నుంచి వడ్డీ రేట్లు నిరంతరాయంగా పెరిగాయి. ఫలితంగా రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. ఆర్‌బీఐ తన గత ద్రవ్య విధానంలో కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే ప్రస్తుతం వడ్డీ రేట్లు గతంలో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ ఐదేళ్ల నుంచి పోలిస్తే ఇవే అధిక వడ్డీ రేట్లు అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏయే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం డిపాజిట్ కాల వ్యవధిని బట్టి 3 శాతం నుంచి 7.10 శాతం వరకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ కాల వ్యవధిని బట్టి 3.50 శాతం నుంచి 7.75 శాతం పరిధిలో ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ 3 శాతం నుంచి 7 శాతం మధ్య ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 50 బీపీఎస్‌ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ​ బ్యాంకులో వడ్డీ రేట్లు ఇలా

ఏడు రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం 46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు  5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ ఇస్తుంది. 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువకు సాధారణ ప్రజలకు  6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు  6.50 శాతం వడ్డీ రేటు వస్తుంది.1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు  6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతంగా ఉంది. 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 7.10 శాతం సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతంగా ఉంది. ఐదు సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు  7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతంగా ఉంది.

యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 

ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ రేటు ఉంటే 46 రోజుల నుండి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 61 రోజుల నుంచి మూడు నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం. మూడు నెలల నుంచి ఆరు నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 7 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతంగా ఉంది. ఇలా దశల వారీగా పెరుగుతూ ఐదు సంవత్సరాల నుంఛఙ 10 సంవత్సరాల డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ 

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు  3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు  3.50 శాతంగా ఉంటుంది. 46 రోజుల నుంచి 179 రోజులు డిపాజిట్లకు సాధారణ ప్రజలకు  4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు  5.00 శాతం. 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.75 శాతంగా వడ్డీ రేటు ఉంది. 211 రోజుల నుంచి 1 సంవత్సరాల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు 5.75 శాతంగా ఉంటే సీనియర్ సిటిజన్లకు  6.25 శాతంగా వడ్డీ రేటు ఉంటుంది. ఇలా దశల వారీగా పెరుగుతూ రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతంగా వడ్డీ రేటు ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం