Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.. మరి వీటిపై టాక్స్ ఉంటుందా?

|

Feb 24, 2023 | 6:18 PM

కష్టపడి సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా అవసరాలకు వాడుకుని అందులో కొంత భాగం పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. ఎక్కువ మంది తమ డబ్బుకు బ్యాంకులలో భద్రత..

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.. మరి వీటిపై టాక్స్ ఉంటుందా?
Fixed Deposit
Follow us on

కష్టపడి సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా అవసరాలకు వాడుకుని అందులో కొంత భాగం పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. ఎక్కువ మంది తమ డబ్బుకు బ్యాంకులలో భద్రత ఉంటుందని నమ్ముతారు. అది నిజమే. కానీ, బ్యాంకులలో దాచుకునే డబ్బుపై వడ్డీ తక్కువగా వస్తుంది. అయితే ఇటీవల కాలంలో బ్యాంకులు ఫిక్స్ డ్ దీపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఫిక్స్ డ్ దీపాజిట్ల పై వచ్చే వడ్డీ పై టాక్స్ లు ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఈ వివరాలు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లతో సహా పలు పెద్ద బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు మీరు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై గరిష్టంగా 7% వడ్డీని పొందుతారు. మీరు ఈ రోజుల్లో ఎఫ్‌డి చేయాలని ప్లాన్ చేస్తుంటే, దీనికి ముందు మీరు బ్యాంకుల కొత్త వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలియజేస్తున్నాం. తద్వారా మీరు మీ ప్రకారం సరైన స్థలంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు.

ఇక ఎఫ్‌డీ నుంచి స్వీకరించిన వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీరు ఒక సంవత్సరంలో ఎఫ్‌డీపై ఏ వడ్డీని సంపాదించినా, అది మీ వార్షిక ఆదాయానికి కలుపుతారు. మొత్తం ఆదాయం ఆధారంగా మీ పన్ను స్లాబ్ నిర్ణయిస్తారు. ఎఫ్‌డీపై సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అందుకే అది మూలం లేదా టీడీఎస్‌ వద్ద తగ్గించే పన్ను కింద వసూలు చేస్తారు. మీ బ్యాంక్ మీ వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు క్రెడిట్ చేసినప్పుడు అదే సమయంలో టీడీఎస్‌ కట్ అయిపోతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై పన్నుకు సంబంధించిన కొన్ని పాయింట్లను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • ఒక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్‌ని తీసివేయవు. అయితే దీని కోసం మీరు ఫారమ్ 15G లేదా 15H సమర్పించాలి. అటువంటి పరిస్థితిలో మీరు టీడీఎస్‌ని సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫారమ్ 15G లేదా 15H సమర్పించండి.
  • అన్ని ఎఫ్‌డీల నుంచి మీ వడ్డీ ఆదాయం సంవత్సరంలో రూ. 40,000 కంటే తక్కువగా ఉంటే టీడీఎస్‌ తీసివేయరు. మరోవైపు, మీ వడ్డీ ఆదాయం రూ. 40,000 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు 10% టీడీఎస్‌ తీసివేయడం జరుగుతుంది. పాన్ కార్డ్ ఇవ్వనందుకు బ్యాంక్ 20% తీసివేయవచ్చు.
  • 40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ తీసివేయడానికి ఈ పరిమితి 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం. మరోవైపు ఎఫ్‌డీ ద్వారా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ. 50,000 వరకు పన్ను రహితం. దీని కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 10% టీడీఎస్‌ తీసివేయడం జరుగుతుంది.
  • ఒకవేళ బ్యాంక్ మీ ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ని తీసివేసి, మీ మొత్తం ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి రానట్లయితే మీరు పన్ను దాఖలు చేస్తున్నప్పుడు తీసివేసిన టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు. ఇది మీ ఖాతాలో జమ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి