Rising Prices: కూరగాయలూ కొనలేమంటున్న సామాన్యులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.. బాదుడు ఆగదా..?

Rising Prices: మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (retail inflation) ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా పెరిగింది. ఏకంగా 17 నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రజలు వినియోగించే అనేక వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

Rising Prices: కూరగాయలూ కొనలేమంటున్న సామాన్యులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.. బాదుడు ఆగదా..?
Inflation

Updated on: Apr 16, 2022 | 1:07 PM

Rising Prices: మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (retail inflation) ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా పెరిగింది. ఏకంగా 17 నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రజలు వినియోగించే అనేక వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలు మార్చిలో కంటే ఏప్రిల్‌లో కూరగాయలకు కొనేందుకు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోందని డిజిటల్ కమ్యూనిటీ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది కూరగాయల కొనుగోలుకు ఎక్కువ చెల్లించినట్లు తెలిపారు. నాలుగింట ఒక వంతు ఎక్కువ చెల్లిస్తున్నట్లు వారు చెప్పారు. ఇందుకోసం దేశంలోని 311 జిల్లాల్లో సర్వే చేయగా 11,800 మంది స్పందించారు. విపరీతమైన ధరల పెరుగుదల కారణంగా తాము వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవలసి వచ్చిందని 36 వేల మందిలో 24 శాతం మంది తెలిపారు. వంట నూనెల రిటైల్ రేట్ల పెంపు కారణంగా 29 శాతం మంది తక్కువ ధరకు దొరికే వంట నూనెను వినియోగించడం ప్రారంభించినట్లు తెలిపారు.

ఇటీవల విడుదలైన వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠమైన 6.95 శాతానికి చేరుకుంది. ఇంధనం, కూరగాయలు, పాలు , మాంసం, తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాల ధరలు భారీదా పెరగడం దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా మార్చిలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ నెలలో ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలోని 5.85 శాతం నుంచి 7.68 శాతంగా పెరిగింది. మార్చిలో ఏడాది ప్రాతిపదికన 18.79 శాతం పెరిగిన నూనెలు, ఫ్యాట్స్ ధరల పెరుగుదల కారణంగా ఫుడ్‌ బాస్కెట్‌ లో స్పైక్ కనిపించింది.

కూరగాయల ధరలు 11.64 శాతం పెరగగా.. మాంసం, చేపల ధరలు 9.63 శాతం, సుగంధ ద్రవ్యాలు 8.50 శాతం మేర పెరిగాయి. మార్చిలో ఆల్కహాల్ లేని పానీయాల ధరలు 5.62 శాతం పెరగగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 4.93 శాతం.. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4.71 శాతం మేర పెరిగిపోయాయి. ఇటీవలి ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లాజిస్టిక్స్ అంతరాయాలు ప్రధాన కారణంగా నిలిచాయి.

గత వారం ద్రవ్య విధాన ప్రకటనలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతానికి సవరించింది. అంతకు ముందు ఇది 4.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరి చివరి నుంచి పెరిగిన అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలను పెంచినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రపంచ సప్లై చైన్ సమస్యల కారణంగా ధరల ఒత్తిడి కొనసాగవచ్చని ఆయన వెల్లడించారు. ఇది పౌల్ట్రీ, పాలు, పాల ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Sports18: స్పోర్ట్స్ ప్రియులకు శుభవార్త.. జియో నుంచి సరికొత్త ఛానల్..

Mutual Funds: మనీ మార్కెట్ ఫండ్స్‌ ఎలా పని చేస్తాయి.. వాటిలో పెట్టుబడి ఎంత వరకూ లాభం..