Anand Mahindra: ఆమె ట్వీట్‌కు ఎమోషనల్ అయిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే..

Anand Mahindra: ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విట్టర్ లో ఒక యువతి పెట్టిన మెసేజ్ ఆయనను కదిలించింది.  ఆమెకు బదులిచ్చే క్రమంలో వ్యాపారం, వాణిజ్యం, స్టార్టప్‌ల అసలైన లక్ష్యాలను గురించి ఆయన వివరించారు.

Anand Mahindra: ఆమె ట్వీట్‌కు ఎమోషనల్ అయిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే..
Anand Mahindra

Updated on: Apr 07, 2022 | 3:34 PM

Anand Mahindra: ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విట్టర్ లో ఒక యువతి పెట్టిన మెసేజ్ ఆయనను కదిలించింది.  ఆమెకు బదులిచ్చే క్రమంలో వ్యాపారం, వాణిజ్యం, స్టార్టప్‌ల అసలైన లక్ష్యాలను గురించి ఆయన వివరించారు. ఓ వ్యాపారవేత్త ఏం కోరుంటాడు? ఏ లక్ష్యంతో ఒక స్టార్టప్‌ ను స్థాపిస్తాడు? వ్యాపారం వెనుక అసలైన ప్రయోజనం ఏంటనే ప్రశ్నలకు ఒక మెసేజ్‌తో సమాధానం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే.. కృతి జైస్వాల్‌ అనే మహిళ 2022 మార్చి 15 ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘ఆనంద్‌ మహీంద్రా సార్‌. ఈరోజు నేను ప్రయాణిస్తుంటే మార్గమధ్యంలో కండీవలీ ఈస్ట్‌లో (ముంబై) మహీంద్రా ఫ్యా‍క్టరీ కనిపించింది. మా నాన్న ఆ ఫ్యాక్టరీలోనే పని చేసేవారు. అప్పుడు మేము పాత్రా చావల్‌ నుంచి స్కూల్‌కి వెళ్లేవాళ్లం. ఈ రోజు మా నాన్న రిటైర్‌ అయ్యారు. మేము జీవితంలో మంచిగా సెటిల్‌ అయ్యాం. దీనంతటికి కారణం కండీవలీలోని మహీంద్రా సంస్థకు చెందిన ఫ్యాక్టరీ’ అంటూ తన జీవిత విశేషాన్ని చెప్పింది.

రెండు వారాలా తర్వాత దీనిని ఆనంద్‌ మహీంద్రా గమనించారు. ఆమె చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. ‘ఇలాంటి విషయాలు విన్నప్పుడే ఓ వ్యాపారవేత్తగా సంతోషం కలుగుతుంది. ప్రతీ రోజు ఇంకా బాగా పని చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఎన్నో కలలతో స్టార్టప్‌లు ప్రారంభించే ఎంట్రప్యూనర్లందరి లక్ష్యం కూడా ఇదే. ప్రజల జీవితాల్లో కనిపించే మంచి మార్పే తమ కంపెనీల నిజమైన నెట్‌వర్త్‌గా వారు భావిస్తారు’ అంటూ ఆమె జీవిత గాథకు రిప్లై ఇచ్చారు.

ఇవీ చదవండి..

RUSSIA PLAN B: పుతిన్‌కు ఓటమి భారమా ? పరువు నిలుపుకునే వ్యూహమా? అమల్లోకి రష్యా ప్లాన్ బీ.. మరి జెలెన్‌స్కీ మాటేంటి?

Optical Illusion: ఈ ఫోటో చూడగానే మీకు ముందుగా ఏం కనిపిస్తోంది.. దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..