Flight Ticket Offer: ప్రయాణికులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌. ఎలా బుక్‌ చేసుకోవాలంటే.

|

Dec 23, 2022 | 6:21 PM

ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కేవలం కొంత మందికి మాత్రమే పరిమితమైన అంశంగా ఉండేది. కానీ పెరుగుతోన్న పోటీ కారణంగా విమానయాన సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుండడంతో తక్కువ ధరకే విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది...

Flight Ticket Offer: ప్రయాణికులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌. ఎలా బుక్‌ చేసుకోవాలంటే.
Flight Ticket Offer
Follow us on

ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కేవలం కొంత మందికి మాత్రమే పరిమితమైన అంశంగా ఉండేది. కానీ పెరుగుతోన్న పోటీ కారణంగా విమానయాన సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుండడంతో తక్కువ ధరకే విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది. వీటికి తోడు కొన్ని సంస్థలు ప్రత్యేక సందర్భాల్లో మరింత ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపరాఫర్‌ ప్రకటించింది. న్యూ ఇయర్‌ కానుకగా తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశాన్ని కలిపించింది.

నిర్ణీత తేదీల్లో టికెట్లు బుక్‌ చేసుకునే వారికి రూ. 2023కే విమాన టికెట్లు పొందే అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేశీయంగా విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 2023, అంతర్జాతీయ విమానాల టికెట్‌ ధర రూ. 4999కే అందిస్తోంది. ఈ మూడు రోజుల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జనవరి 15, 2023 నుంచి ఏప్రిల్‌ 14, 2023 మధ్య తేదీల్లో ప్రయాణం చేయొచ్చు. దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌ కార్డులతో టికెట్ బుక్‌ చేసుకునే వారికి అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

ఇవి కూడా చదవండి

కొత్త ఏడాది కానుకగా ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాట దాదాపు 55 శాతంగా ఉండడం విశేషం. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న కారణంగానే ఇండిగోకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..