JIO Recharge: జియో కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కొత్త రీచార్జ్ ప్లాన్‌తో ఊహించని బెనిఫిట్స్..
టెలికాం రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను, సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తూ కస్టమర్లను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కస్టమర్లకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్‌ను..
టెలికాం రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను, సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తూ కస్టమర్లను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కస్టమర్లకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్‌ను అందించింది. కొత్త సంవత్సరం వేళ న్యూ ఇయర్ లాంచ్ ఆఫర్ పేరు మీద ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కువ కాలం వ్యాలిడిటీ, ఇంటర్‌నెట్ డేటా కోరుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని జియో చెబుతోంది.
ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు రూ. 2023తో రీఛార్జ్ చేసుకుంటే 253 రోజుల వాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తారు. ఈ లెక్కన యూజర్లు మొత్తం 630 జీడీ డేటాను పొందొచ్చు. వీటితో పాటు వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను ఉచితంగా పొందొచ్చు.
దీంతో పాటు జియో మరో ఆఫర్‌ను కూడా అందిస్తోంది. రూ. 2999తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు 365 రోజులు వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద, కస్టమర్‌లు 23 రోజులు అదనంగా వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 75 జీబీ డేటాను అదనంగా పొందుతారు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..