Retail Inflation: సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. 6 శాతం కంటే దిగవకు.. మరింత తగ్గితే..

వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్‌ నెలలో 5.88 శాతంగా నమోదైంది.

Retail Inflation: సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. 6 శాతం కంటే దిగవకు.. మరింత తగ్గితే..
Retail Inflation Drops
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 12, 2022 | 6:49 PM

వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. నవంబర్ నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.88 శాతానికి తగ్గింది. అక్టోబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.77 శాతంగా ఉంది. ఏడాది క్రితం నవంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ తగ్గుదల ఉంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గగా, అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది. అదే సమయంలో, నవంబర్ నెలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది.  అంతకుముందు నెల ఇది 7.01 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం కీలక గణాంకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంతమైన స్థాయికి పైనే ఉండడం గమనార్హం.

ఆహార ద్రవ్యోల్బణంలో భారీగా తగ్గుదల 

రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు తగ్గడం. ఆహార ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్ 2022లో 7.01 శాతంగా ఉంది. ఇది నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గింది. మరోవైపు అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.53 శాతం ఉండగా.. నవంబర్‌లో 3.69 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.30 శాతం ఉండగా.. నవంబర్‌లో 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం -8.08 శాతానికి తగ్గింది. పండ్ల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా ఉంది.

RBI టాలరెన్స్ బ్యాండ్ పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం

రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్థాయి కంటే దిగువకు దిగజారడం అతిపెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. ఆర్‌బీఐ 2 నుంచి 6 శాతం ద్రవ్యోల్బణం రేటును సహించమని నిర్ణయించింది. కానీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే స్థిరంగా ఉంది. ఏప్రిల్‌లో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత, ఐదు ద్రవ్య విధాన సమావేశాల తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచింది. రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది.

ఈఎంఐ చెల్లింపుదారుకు ఉపశమనం..

ద్రవ్యోల్బణం తగ్గుతూనే ఉంటే.. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేటు పెంపునకు బ్రేక్ పడవచ్చు. రెపో రేటు పెంపు ప్రక్రియ ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం పెరిగితే వడ్డీ రేట్లు కూడా చౌకగా మారవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే