Davos MOU’s: దావోస్‌లో పెరిగిన భారత ఖ్యాతి.. 20 ట్రిలియన్ల పెట్టుబడికి ఎంఓయూలు

|

Jan 25, 2025 | 3:08 PM

ఐదు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం శుక్రవారం ముగిసిన విషయం అందిరికీ తెలిసిందే. ఈ సమావేశంలో పెట్టుబడిదారులు భారతదేశంపై విశ్వాసాన్ని చూపారు. మహారాష్ట్రతో దాదాపు రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఎంఓయూల్లో ఇది తేటతెల్లమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Davos MOU’s: దావోస్‌లో పెరిగిన భారత ఖ్యాతి.. 20 ట్రిలియన్ల పెట్టుబడికి ఎంఓయూలు
Davos Wef
Follow us on

దావోస్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులతో సహా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులు హాజరయ్యారు. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పెట్టుబడుల విషయంపై జరిగిన ఎంఓయూలు సంతోషాన్ని కలిగిచాయని చెబుతున్నారు. భారతదేశంపై నమ్మకం, భారతీయుల ప్రతిభకు ఇది తార్కాణమని పేర్కొంటున్నారు. ప్రపంచం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, భారతదేశం పౌరుల హక్కులను గౌరవించే భారతదేశంలో పెట్టుబడికి విశ్వసనీయ దేశంగా పెట్టుబడిదారులు భావించారని వివరించారు. శాంతితో పాటు సమ్మిళిత అభివృద్ధిని విశ్వసించే దేశం మాదేనంటూ స్పష్టం ప్రపంచానికి స్పష్టంగా చూపించడంతో ఈస్థాయి పెట్టుబడులు సాధించామని వివరిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రతినిధి బృందం రూ.15.70 లక్షల కోట్ల విలువైన 61 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాల ద్వారా 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.

సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారించి రూ. 1.79 లక్షల కోట్ల విలువైన 20 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని కేరళ పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ చెబుతున్నారు. ఇన్వెస్ట్ కేరళ పెవిలియన్‌లో 30కి పైగా వన్-టు-వన్ సమావేశాలను నిర్వహించారు. విభిన్న రంగాలలో రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి దాని ప్రతిష్టాత్మక దృష్టిని ప్రదర్శించింది. 

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ గ్లోబల్ బెవరేజ్ దిగ్గజం ఏబీ ఇన్‌బేవ్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పానీయాల రంగంలో 250 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని వివరించారు. భారతదేశంలో హిందుస్థాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) కంపెనీ యూనిలీవర్ తెలంగాణలో రెండు కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అనేక ఇతర గ్లోబల్ కంపెనీలు భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాన్ని అన్వేషించాయి. వీరికి భారతదేశం నుండి 100 మంది సీఈఓలు, ఇతర అగ్ర నాయకులు ప్రాతినిధ్యం వహించారు. వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ తదుపరి వార్షిక సమావేశం దావోస్‌లో జనవరి 19-23, 2026 వరకు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి