
బుధవారం జరిగిన 56వ సమావేశంలో GST కౌన్సిల్ తదుపరి తరం GST సంస్కరణలను ప్రకటించింది. GSTని ప్రస్తుత నాలుగు-శ్లాబ్ నిర్మాణం 5, 12, 18, 28 శాతం నుండి 5, 18 శాతం రెండు-శ్లాబ్ నిర్మాణానికి కుదించారు. కానీ, హై-ఎండ్ కార్లు, పొగాకు, సిగరెట్లు వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు ప్రత్యేక 40 శాతం స్లాబ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.
జూలై 1, 2017న ప్రవేశపెట్టినప్పటి నుండి GST వ్యవస్థ అతిపెద్ద సంస్కరణను చూసింది. చాలా రోజువారీ గృహావసర వస్తువులు తక్కువ పన్ను శ్లాబులలోకి వచ్చే అవకాశం ఉంది, కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చౌకగా ఉంటాయి. GST స్లాబ్ మార్పుల తర్వాత బంగారం, వెండిపై GST రేటు మారలేదు.
బంగారం, వెండి ఆభరణాలపై GST 3 శాతం వద్దే ఉంది. తయారీ ఛార్జీలపై అదనంగా 5 శాతం ఉంటుంది. అదే సమయంలో బంగారు నాణేలు, కడ్డీలు 3 శాతం GSTని కలిగి ఉంటాయి. అందువల్ల GST 2.0 సంస్కరణలు బులియన్ల డిమాండ్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవు. మీరు భారతదేశంలో 10 గ్రాముల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, మీరు బంగారం విలువపై 3 శాతం GST, తయారీ ఛార్జీలపై అదనంగా 5 శాతం GST చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి