గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మన్ శాక్స్ 2022లో 6.9%గా ఉన్న భారతదేశంలో ఆర్థిక వృద్ధి 2023 క్యాలెండర్ సంవత్సరంలో 5.9%కి తగ్గుతుందని అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, తగ్గిన వినియోగ గిరాకీ వంటి సవాళ్లతో.. కరోనా నుంచి వేగంగా కోలుకున్న ఫలాలు తగ్గాయని పేర్కొంది. అందువల్లే వృద్ధి నెమ్మదించనుందనిగ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.
ఈ సంవత్సరం భారత జీడీపీ 6.9 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఏడాది అది 5.9 శాతానికి తగ్గుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2023 ప్రథమార్ధంలో వృద్ధి నెమ్మదిగా ఉంటుందని భావిస్తోంది. కోవిడ్ పునరుత్తేజ ఫలితాలు కనుమరుగవ్వడం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని తెలిపింది.
అయితే ద్వితీయార్ధానికి వృద్ధి వేగంగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి పెరగడం, అలాగే ఎగుమతులు సైతం పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి 2021-22లో వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం ఆ జోరును కొనసాగించలేకపోయిందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.
ఇందుకు అనేక సవాళ్లు అడ్డంకిగా మారాయని తెలిపింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరగడం వంటి పరిణామాలు అడ్డంకిగా మారాయని వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చినట్లయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ మెరుగ్గానే ఉందని తెలిపింది. మరో వైపు ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 6.8%గా ఉంటుందని, వచ్ఏచ ఏడాది 6.1 %కు తగ్గుతుందని తెలిపింది. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్‌లో రో 50 వేసిస్ పాయింట్లు, ఫిబ్రవరిలో 35 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని భావిస్తోంది.
దీంతో రెపోరేటు 6.75 % వరకు చేరుకుంటుందని అంచనా వేసింది. భారత వృద్ది అంచనాను కూడా క్రిసిల్ 7.3 % నుంచి 7 %నికి తగ్గిందని ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో వృద్ది 6 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అనేక రేటింగ్ ఏజన్సీలు అక్టోబర్, నవంబర్ మధ్య భారతదేశ వృద్ది అంచనాను తగ్గించాయి.
Global growth is forecast to slow next year. In their 2023 Outlook, our economists expect the US to narrowly avoid recession as inflation slows, Europe’s economy contracts, and China manages a bumpy reopening. Read more: https://t.co/9Y5fSv2JPq pic.twitter.com/oX9zEsVqNR
— Goldman Sachs (@GoldmanSachs) November 18, 2022
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నవంబర్ 11న భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను దాని మునుపటి అంచనా 7.7% నుండి 7%కి తగ్గించింది. ప్రపంచ బ్యాంక్ జూన్‌లో ప్రకటించిన 7.5% కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-’23) భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.5%కి తగ్గించింది. క్షీణిస్తున్న అంతర్జాతీయ పర్యావరణం కారణంగా వృద్ధి అంచనాను ఒక శాతం దిగువకు సవరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి