Credit Spending: అప్పులు చేసిమరీ వస్తువులు కొంటున్న జనం.. గతంలో ఎన్నడూ లేని ధోరణి.. ఎందుకంటే..

|

May 21, 2022 | 6:12 PM

Credit Spending: అసలే కరోనా నుంచి తేరుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఊహించని పిడుగులా మారింది. దీంతో తమ వద్ద డబ్బు లేనప్పటికీ భారతీయులు కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులను భారీగా అప్పులు చేసిమరీ కొంటున్నారు.

Credit Spending: అప్పులు చేసిమరీ వస్తువులు కొంటున్న జనం.. గతంలో ఎన్నడూ లేని ధోరణి.. ఎందుకంటే..
Consumer Durabilities
Follow us on

Credit Spending: అసలే కరోనా నుంచి తేరుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఊహించని పిడుగులా మారింది. దీంతో తమ వద్ద డబ్బు లేనప్పటికీ భారతీయులు కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులను భారీగా అప్పులు చేసిమరీ కొంటున్నట్లు తేలింది. దాదాపుగా 60 శాతం మంది దేశ వాసులు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి ఇందుకోసం రుణాలను తీసుకుంటున్నట్లు తేలింది. ప్రజల్లో వచ్చిన విశ్వాసం కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి కరోనా మునుపటి స్థాయిలకు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

మార్చి 2022 చివరి నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు మొత్తం రూ. 1.48 లక్షల కోట్లకు చేరుకోగా, వినియోగదారుల రుణాలు మొత్తం రూ. 27,618 కోట్లుగా ఉన్నాయి. వాహన రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 9% పెరిగి రూ. 3.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణాంకాలన్నీ కరోనా మహమ్మారి ముందు కంటే ఎక్కువగా ఉన్నాయి. పర్సనల్ లోన్స్ కు డిమాండ్‌ను పెంచే వివాహాలు, ప్రయాణం వంటి కార్యకలాపాలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. వేతన ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన వంటివి కూడా ఇందుకు సహాయపడిందని కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోని కన్స్యూమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుజ్ చందనా చెప్పారు. పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం నో-కాస్ట్, తక్కువ-కాస్ట్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు (EMI)తో సహా వినియోగదారు ఫైనాన్స్ పథకాలు ఇటీవలి నెలల్లో పుంజుకున్నాయి.

కన్స్యూమర్ డ్యూరబుల్స్.. ముఖ్యంగా గృహోపకరణాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, మే చివరికి లేదా జూన్ మొదటి వారంలో ధరలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడిపదార్థాల ధరలతో కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకునేందుకు రేట్లును పెంచేందుకు సిద్ధమౌతున్నాయి. టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తుల ధరలను 3 నుంచి 5% వరకు పెంచడం ద్వారా ఇండస్ట్రీ ప్లేయర్లు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయాలని చూస్తున్నాయి.
అంతేకాకుండా.. US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం వినియోగదారు డ్యూరబుల్స్ పరిశ్రమకు అదనపు సమస్యలను కలిగిస్తోందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఉపకరణాల తయారీదారుల సంఘం (CEAMA) అభిప్రాయపడింది. ఈ కారణంగా దిగుమతి చేసుకునే ముడిపదార్ధాల ధరలు మరింత పెరిగి తయారీ ఖర్చులను పెంచుతాయని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి