Stock Market: ఆరంభంలోనే బేజారిన బెంచ్ మార్క్ సూచీలు.. ఫోకస్ లో ఉన్న ఆ మూడు కంపెనీల షేర్లు..

|

May 31, 2022 | 9:30 AM

Stock Market: నిన్న బంపర్ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఎఫ్ఐఐలు, డీఐఐలు నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ మార్కెట్లు మళ్లీ బేజారాయి.

Stock Market: ఆరంభంలోనే బేజారిన బెంచ్ మార్క్ సూచీలు.. ఫోకస్ లో ఉన్న ఆ మూడు కంపెనీల షేర్లు..
Stock Market
Follow us on

Stock Market: నిన్న బంపర్ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఎఫ్ఐఐలు, డీఐఐలు నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ మార్కెట్లు మళ్లీ బేజారాయి. ఉదయం 9.15 గంటలకు బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ-50.. 83 పాయింట్లు, మరో సూచీ సెన్సెక్స్ 300 పాయింట్ల మేర నష్టపోయి ఆరంభంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 210, నిఫ్టీ మిడ్ క్యాప్ 10 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయంలో ఎల్ఐసీ, ఐఆర్సీటీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు ఫోకస్ లో ఉన్నాయి. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో జీడీపీ ఏడాది కనిష్ఠానికి చేరుకుంది. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గటం దీనికి కారణంగా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లు ప్రారంభానికి ముందు ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ నెగటివ్ లో ప్రారంభం కావటం కూడా మార్కెట్లు నెగటివ్ సెంటిమెంట్ లో కొనసాగటానికి మరో కారణంగా నిలుస్తోంది.

నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ 2.99%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.49%, బజాజ్ ఆటో 1.06%, మహీంద్రా అండ్ మహీంద్రా 0.98%, ఐషర్ మోటార్స్ 0.80%, టాటా స్టీల్ 0.79%, కోల్ ఇండియా 0.77%, గెయిల్ 0.70%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 0.69%, టాటా మోటార్స్ 0.53% మేర ఆరంభంలో లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో సన్ ఫార్మా 2.88%, టైటాన్ కంపెనీ 2.11%, హెచ్డీఎఫ్సీ 1.88%, ఇన్ఫోసిస్ 1.74%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.01%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.95%, టాటా కన్సల్టెన్సీ 0.93%, హిందుస్థాన్ యూనీలివర్ 0.90%, యస్ బ్యాంక్ 0.74%, భారతీ ఎయిర్ టెల్ 0.72% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.