Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..

|

Mar 17, 2022 | 9:40 AM

Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బెంట్ మార్క్ సూచీ సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభం అయింది.

Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..
Market opening
Follow us on

Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బెంట్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 850 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభం కాగా.. మరో సూచీ నిఫ్టీ(Nifty) 250 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సైతం 700 పాయింట్లకు పైగా లాభంలో ఉంది. మరో సూచీ నిఫ్టీ మిడ్ క్యాప్ 385 పాయింట్ల ఆరంభ లాభంలో ట్రేడ్ అవుతున్నాయి.

హెచ్డీఎఫ్సీ 3.21%, యాక్సిస్ 2.53%, ఏషియన్ పెయింట్స్ 2.33%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.07%, బజాజ్ ఫైనాన్స్ 1.94%, అల్ట్రా టెక్ సిమెంట్ 1.92%, హిందుస్థాన్ యూనీలివర్ 1.55% కంపెనీల షేర్లు ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. వీటిలో ఎక్కువ శాతం బ్యాంకింగ్, టెక్ కంపెనీలు లాభపడ్డాయి. కానీ Pay TM షేర్ పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. షేర్ విలువ రోజురోజుకూ మరింతగా పతనం కావటంపై మదుపరులు ఆందోళన చెందుతున్నారు. ఈ పతనం ఎంత వరకు కొనసాగనుందనేది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

విదేశీ మదుపరులు నిన్న చాలా నెలల తరువాత తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లలో తిరిగి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. కేవలం ఒక్కరోజే సుమారు రూ. 310 కోట్లుకు పైగా పెట్టుబడులను తిరిగి మన మార్కెట్లోకి తెచ్చారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపరులు సైతం రూ. 700 కోట్లకు పైగా కొత్త పెట్టుబడిని పెట్టారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ఆ ప్రభావం మార్కెట్లపై పెద్దగా లేదని కనిపిస్తోంది.

ఇవీ చదవండి..

Airline Business: అప్పుల ఊబిలో విమాన రంగం.. లాభాల ఆకాశంలోకి అవి ఎగరగలవా..?

Russia Ukraine War: యుద్ధ ప్రభావంతో పెరగనున్న వాటి ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..