Stock Markets Crash: రష్యా- ఉక్రెయిన్ వివాదంలో రష్యా బాంబుల(Russia bombing) వర్షంతో చేసిన దుస్తాహసంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి(Market fall). ఉక్రెయిన్ లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతనమవడంతో రోజంతా బ్లడ్ బాత్(Blood bath) కొనసాగింది. దీంతో 10 లక్షల కోట్ల మదుపరుల సంపద కేవలం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. భారత స్కాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 2800 పాయింట్లు కోల్పోయి 54530 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో జాతీయ స్థాక్ ఎక్ఛేంచ్.. నిఫ్టీ సూచీ సైతం 815 పాయింట్లు కోల్పోయి 16248 పాయింట్ల వద్ద ముగిసింది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ సూచీ 2164 పాయింట్లు పతనమై.. 35228 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ రోజు ఫిబ్రవరి నెల ఆకరి గురువారం కావడంతో డెరివేటివ్ కాంట్రాక్టులు సెటిల్ మెంట్ చివరి రోజు కావడం దీనికి తోడు ఉదయం రష్యా హ్యూహాత్మకంగా ఉక్రెయిన్ లోని అనేక నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడిందని వార్త ప్రపంచ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 17,00 పాయింట్లు తగ్గి 55,552 వద్దకు చేరుకుంది. విస్తృత NSE నిఫ్టీ502 పాయింట్లు క్షీణించి 16,551 వద్దకు చేరుకుంది. జపాన్ నిక్కీ 2.17 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.66 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.89 శాతం క్షీణించడంతో ఆసియా షేర్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. అలాగే, ఉక్రెయిన్ సంక్షోభం మధ్య 2014 తర్వాత మొదటిసారి బ్రెంట్ చమురు బ్యారెల్ $100కి పెరిగింది. దీనివల్ల పెట్రో ధరలు సైతం ఆకాశాన్ని తాకనున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్ అవెన్యూ అయిన గోల్డ్ లోకి తరలిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల దాని ధర క్రమంగా పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చేంత వరకు ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Also read..
Stock Markets Crash: రష్యా దెబ్బ.. దలాల్ స్ట్రీట్ లో బ్రడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
RERA: డబ్బు చెల్లించాక కూడా బిల్డర్ ఇల్లు మీకు స్వాధీన పరచలేదా.. అయితే ఇలా చేయండి..