Stock Market: బుల్ జోరులో కొనసాగుతున్న మార్కెట్లు.. వరుస సెషన్లలో లాభాల పయనం..

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు బుల్ జోరుతో పయనిస్తున్నాయి. నిన్న రష్యా ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగియటంతో దానికి అనుగుణంగా మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి.

Stock Market: బుల్ జోరులో కొనసాగుతున్న మార్కెట్లు.. వరుస సెషన్లలో లాభాల పయనం..
Share Market

Updated on: Mar 30, 2022 | 9:58 AM

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు బుల్ జోరుతో(Bull Markets) పయనిస్తున్నాయి. నిన్న రష్యా ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగియటంతో దానికి అనుగుణంగా మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి. బెంచ్ మార్క్ ఇండీసెస్ సెన్సెక్స్(Sensex) సూచీ 310 పాయింట్లకు పైగా జోరుతో ముందుకు సాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 85 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 170 పాయింట్ల ఆరంభంలో లాభాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో విదేశీ మదుపరులు మరింతగా భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిగ్గజ ఇన్వెస్టింగ్ సంస్థ బ్లాక్ రాక్ చెప్పకనే చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఓఎన్జీసీ కంపెనీలో 1.5 శాతం వాటాను రూ.3000 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

నిఫ్టీ సూచీలో బజాజ్ ఫిన్సర్వ్ 2.47%, హీరో మోటొకార్ప్ 2.33%, హెచ్పీసీఎల్ 2.06%, గ్రాసిమ్ 1.85%, యాక్సిస్ బ్యాంక్ 1.78%, భారతీ ఎయిర్ టెల్ 1.72%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.61%, మారుతీ సుజుకీ 1.49%, టాటా మోటార్స్ 1.43%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.33% మేర పెరిగి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. ONGC 4.27%, హిందాల్కో 2.77%, వేదాంతా 2.64%, టాటా స్టీల్ 2.20%, టెక్ మహీంద్రా 1.73%, సన్ ఫార్మా 0.54%, కోల్ ఇండియా 0.38%, ఎన్టీపీసీ 0.19%, డాక్టర్ రెడ్డీస్ 0.14%, లుపిన్ 0.06% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

 

ఇవీ చదవండి..

Crypto Currencies: క్రిప్టో కరెన్సీ భవిష్యత్ ఏమిటి.. కొత్తగా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చా..?

Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!