Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌..! ఇకపై మీకు ఫ్రీ భోజన సౌకర్యం..!! ఇవీ కొత్త నిబంధనలు..

|

Apr 22, 2023 | 7:27 AM

కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణించేటప్పుడు భోజనానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వే ద్వారా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో లేని ఒక కొత్త సౌకర్యాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటంటే..

Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌..! ఇకపై మీకు ఫ్రీ భోజన సౌకర్యం..!! ఇవీ కొత్త నిబంధనలు..
Indian Railways
Follow us on

పేద, మధ్యతరగతితో పాటు సంపన్న వర్గాలకు సైతం అనుకూలమైనది రైలు ప్రయాణం. రైలులో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు శుభవార్త. మీరు కూడా తరచుగా రైలు ప్రయాణం చేసే వారైతే, ఈ సమాచారం మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించనుంది. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు రైలు ప్రయాణీకులకు అనేక ఉచిత సౌకర్యాలను అందిస్తుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కొంత సమాచారం అందించారు. ఇకపై రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మీరు కూడా రైలులో ప్రయాణం చేయబోతున్నట్లయితే ఇప్పుడు మీకు ఉచితంగా ఆహారం లభిస్తుంది. రైల్వే అందిస్తున్న ఈ ఫ్రీ ఫుడ్‌ సౌకర్యం ఎలా అమలవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణించేటప్పుడు భోజనానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వే ద్వారా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో లేని ఒక కొత్త సౌకర్యాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటంటే..

భారతీయ రైల్వేలో తరచుగా ప్రయాణించేవారు రైలు కోసం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో రైలు ఆలస్యం కావడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు మీ రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ మీకు భోజన సౌకర్యాలను కల్పించనుంది. ఆలస్యానికి ఫలితంగా ప్రయాణికులకు ఉచిత ఆహారం అందజేస్తుంది. రైల్వే కొన్ని ప్రత్యేక ప్రయాణీకులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

IRCTC నియమం ఏమిటో  తెలుసా?

IRCTC నిబంధనల ప్రకారం, ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. మీరు ప్రయాణించే రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తుంది. ఇకపోతే, ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం కూడా..

రైల్వే సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి కూడా ఈ సౌకర్యం కల్పించబడింది . ఏదైనా కారణం చేత మీరు రైలును మిస్‌ చేసుకున్నట్టయితే, మీరు వాపసు పొందవచ్చు. దీని కోసం, రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన 1 గంటలోపు టిడిఆర్ ఫారమ్ నింపి టిక్కెట్ కౌంటర్‌లో సమర్పించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..